తాజా వార్తలు ఫీచర్ న్యూస్

మంచు లక్ష్మి విడుదల చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ ట్రైలర్

Date: August 19, 2017 05:03 pm | Posted By:
అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై `ఒక్క‌డు మిగిలాడు` చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ట్రైలర్...

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై `ఒక్క‌డు మిగిలాడు` చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మంచు ల‌క్ష్మి చేత హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న ట్రైల‌ర్‌ను చాలాసార్లు చూశాను. నా తమ్ముడు మనోజ్ ఒక న‌టుడిగా నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇస్తుంటాడు. త‌ను కొత్త‌గా ఏదో ఒక‌టి చేస్తూ ఉంటాడు. త‌ను ఇండ‌స్ట్రీకి వ‌రం అని భావిస్తున్నాను. నిజ‌మైన క‌థ‌ను సినిమాగా చెప్పాల‌నుకున్న‌ప్పుడు చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. డైరెక్ట‌ర్ అజ‌య్ ఇంటెన్స్ ఉన్న వ్య‌క్తి. ఇలాంటి సినిమాను చేయ‌డం కూడా ఫ్యాష‌నే. అలాంటి ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌ల‌ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మ‌నోజ్‌తో ఏడాదిన్న‌ర‌గా ట్రావెల్ అవుతున్నాను. హింస‌ – అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే పరిస్థితులకు తగ్గట్టు ఎలా అయితే ప్రవర్తిస్తామో అదేవిధంగా ఉంటుంది మనోజ్ గారి క్యారెక్టరైజేషన్. ఒక దేశం, రాష్ట్రం, కుటుంబంలో పెద్ద ఫెయిల్ అయితే దాని ప్ర‌భావం ఆ స‌మాజం లేదా కుటుంబంపై ఎలా ప్ర‌భావం చూపుతుంద‌నేదే ఈ క‌థ‌. శ‌ర‌ణార్థులు సంఖ్య పెరిగిపోతున్నాయి. ఆస్ట్రేలియా జ‌నాభా కంటే ఎక్కువ‌. పాకిస్థాన్‌, అప్ఘ‌నిస్థాన్‌, భూటాన్‌, శ్రీలంక దేశస్థులంద‌రూ మ‌న అన్మ‌ద‌మ్ములే. కానీ అన్ని దేశాలు ప్ర‌శాంతంగా ఉంటున్నాయి. అంద‌రూ చేస్తున్న మార‌ణ‌హోమాలు ఇక్క‌డితో ఆగిపోవు. 21వ శ‌తాబ్ద‌మైనా మ‌నిషి ఆక‌లి కోసం, మ‌నుగ‌డ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఓ నాయ‌కుడు పోరాడుతున్న‌ప్పుడు ఎలాంటి ఫలితాన్ని చూపుతాయ‌నేదే ఈ సినిమా. సామాన్యులు అణ‌గదొక్క‌బ‌డ్డ ప్ర‌తిసారి వారి నుండి ఓ నాయ‌కుడు పుడ‌తాడు.

అత‌ను ఏ మార్గం ఎంచుకుంటూ అనేది ప‌రిస్థితి బ‌ట్టి ఉంటుంది. అలాంటి క‌థే ఒక్క‌డు మిగిలాడు. ఈ సినిమా కోసం మ‌నోజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు త‌గ్గాడు. నిర్మాతగారు ఎంతో స‌పోర్ట్ చేశారు. సినిమాను సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు. సినిమా చాలా వండ‌ర్‌ఫుల్‌గా వ‌చ్చిందని క్లుప్తంగా తెలిపారు. సినిమాలో రెండు పాత్ర‌ల‌ను నేను చేయ‌గ‌ల‌ను న‌మ్మి నాతో సినిమా చేసిన ద‌ర్శ‌కుడు అజ‌య్‌కు, నిర్మాత‌ల‌కు నా కృతజ్ఞతలని హీరో మంచు మ‌నోజ్ తెలిపారు.

నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. “ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తరువాత చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం మనోజ్ గారు బరువు తగ్గడం పెరగడం లాంటివి చేసి చాలా కష్టపడ్డారు. కొత్త కథ అందులోనూ డిఫరెంట్ చిత్రం కనుకే ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చాం.. ఈ సినిమా లో పని చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యం గా టెక్నీషియన్స్ కు మంచి పేరొస్తుంది.. సెప్టెంబర్ 8 న విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ శివ నందిగామ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాకు చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది అన్నారు.

మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • ఒక్కడు మిగిలాడు మూవీ విడుదల తేదీ వాయిదా!

  మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా...
 • Four Movies To Clash On September 8

  Four movies are set clash at box-office on September 8th. Naga Chaitanya’s Yuddham Sharanam, Manchu Manoj’s Okkadu Migiladu and Allari Naresh’s Meda Meeda Abbayi are releasing on the same...
 • Okkadu Migiladu Trailer Launch Photos

  ...
 • Okkadu Migiladu Trailer

  స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి! Here comes #OkkaduMigiladuTrailer.A revolt for respect! pic.twitter.com/Y8znpJAwtK — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) August 19, 2017...