భ‌ర‌త్ విజ‌న్ 2018 అదిరిందిగా..

Bharath Ane Nenu
సిఎం అంటే ఎలా ఉండాలి..? ప‌్ర‌జ‌ల‌కు న్యాయం చేసేలా ఉండాలి. వాళ్ల క‌ష్టాలు తీర్చేలా ఉండాలి.. అయ్యా అంటే ఆదుకునేలా ఉండాలి. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ ఇప్పుడు కొర‌టాల తెర‌కెక్కిస్తోన్న భ‌ర‌త్ లో క‌నిపిస్తున్నాయి. త‌న ముఖ్య‌మంత్రి ఎలా ఉన్నాడో.. ఉండ‌బోతున్నాడో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. భ‌ర‌త్ అనేనేను విజ‌న్ విడుద‌లైంది. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డంతో వాళ్లు వాడే విజ‌న్ అనే ప‌దాన్నే టీజ‌ర్ రూపంలో ఇచ్చాడు కొర‌టాల శివ‌. ఎప్ప‌ట్లాగే ఈ చిత్రంలోనూ మెసేజ్ ఇచ్చాడు కొర‌టాల‌. ఫ్యాక్ష‌నిజం వ‌ద్ద‌ని మిర్చిలో.. గ్రామ‌ద‌త్త‌త అంటూ శ్రీ‌మంతుడులో.. మొక్క‌ల్ని నాటండి అంటూ జ‌న‌తా గ్యారేజ్ లో చెప్పిన కొర‌టాల‌.. ఈ సారి ప్ర‌తీ మ‌నిషికి భ‌యం బాధ్య‌త ఉండాలంటున్నాడు. అవి లేక‌పోతే మ‌నిషి కాదంటున్నాడు. ఎంత క‌ష్ట‌మొచ్చినా ఇచ్చిన మాట కోసం నిల‌బ‌డేవాడే మ‌నిషి అంటూ ఇందులో సందేశాన్ని నింపి భ‌ర‌త్ అనే నేనును ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాడు కొర‌టాల శివ‌. విజ‌న్ లో హీరోయిన్ కైరా ఊసే క‌నిపించ‌లేదు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ‌రోసారి త‌న ఆర్ఆర్ తో మాయ చేసాడు. ఎప్రిల్ 8న ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. ఎప్రిల్ 20న ఈ సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here