భాగమతి రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

తారాగణం: అనుష్క శెట్టి, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశ శరత్, మురళి శర్మ
సంగీతం: ఎస్ థమన్
దర్శకతవం: అశోక్
నిర్మాతలు: వంశి, ప్రమోద్
బ్యానర్: యూవీ క్రియేషన్స్
కథ:
చంచల (అనుష్క) ఓ ఐఏఎస్ అధికారి, ఆమె హోమ్ మినిస్టర్ వద్ద పిఏ గా పనిచేస్తుంటుంది. వరస గుడి దొంగతనాలు జరుగుతున్న నేపథ్యం లో బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయవలికిసి వస్తుంది. అదే సమయంలో తన లవర్(ఉన్ని) ని మర్డర్ చేసినందుకు గాను చంచలకు జైలు శిక్ష పడుతుంది. సి బి ఐ అధికారి వైష్ణవి(ఆశ శరత్) ను విచారణ జరపవల్సిందిగా కేంద్రం నియమిస్తుంది.
వైష్ణవి చంచలను విచారించడానికి గాను ఓ జైలు నుండి పాడుబడ్డ బంగ్లాకు తరలిస్తోంది. అక్కడ చిత్రమైన సంఘటనలు ఎదురుకొన్న చంచలను భాగమతి ఆత్మ ఆవహిస్తుంది. తర్వాత ఏమైందో వెండితెరపై చూస్తేనే ఉంటుంది థ్రిల్.
రివ్యూ:
భాగమతి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా మనముందుకు వచ్చింది కథ అంతేమి లేకపోయినా కథనం కొత్తగా చాల ఇంటరెస్టింగ్ గా ఉండేలా దర్శకుడు అశోక్ జాగర్తలు తీసుకున్నాడు. నేర విచారణ జరుగుతున్న క్రమంలో అప్పుడప్పుడు వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. సస్పెన్స్ ను పోనివ్వకుండా ప్రేక్షకులను కట్టిపడేసే ట్రీట్మెంట్ చిత్రానికి బలం. హారర్ చిత్రంగా మొదలై క్రమంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా కథ మలుపులు తిరుగుతుంది. అనుష్క, ఉన్నిల మద్య రొమాంటిక్ ట్రాక్ బాగానే పండింది. హారర్ లో హాస్య పోలీస్ పాత్రలతో కామెడీ కలిపి సరదాగా ఫస్ట్ హాఫ్ సాగగా, సెకండ్ హాఫ్ మిస్టరీ ఛేదించడం పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు. అక్కడక్కడా ల్యాగ్ అనిపించినా సస్పెన్స్ ఉత్కంఠత నిలబెడుతుంది.
పెరఫార్మన్సెస్:
చంచలంగా, భాగమతిగా అనుష్క నటన అద్భుతం అని చెప్పాలి. తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్ తోనే అనుష్క పాత్రలకు వన్నె తెచ్చింది. ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా హుందా ప్రదర్శించగా భాగమతి గా తనకే సాటి అయిన రాజరికం ప్రదర్శించింది అనుష్క. ఇతర పాత్రల్లో జయరాం, ఆశ శరత్, ఉన్ని ముకుందం, మురళి శర్మ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికత:
భాగమతి ఉన్నత ప్రొడక్షన్ విలువలతో నిర్మించారు యూవీ క్రియేషన్స్ వారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ చిత్రానికి ప్లస్ అయ్యింది. రీరికార్డింగ్ తోనే భయపెట్టారు. ఛాయాగ్రహణంకూడా చక్కగా ఉంది. భాగమతి లో ప్రదానంగా చెప్పుకోవలసింది ఆర్ట్ డైరెక్షన్ గురించి. భాగమతి బంగ్లా సెట్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వేశారని తెలిసిందే. ఆ బంగ్లా లేకపోతే భాగమతి చిత్రం లేనట్లే. గ్రాఫిక్స్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. దర్శకుడు అశోక్ భాగమతిని ఓ కొత్త ఒరవడిలో సాగే ఓ మంచి థ్రిల్లర్ గా మలచడంలో సఫలమయ్యాడనే చెప్పుకోవాలి.
చివరి మాట: భాగమతి భయపెడుతుంది, నవ్విస్తుంది, బాధపెడుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here