బొబ్బిలిరాజా బ‌ర్త్ డే నేడు..

తెలుగు ఇండ‌స్ట్రీ బొబ్బిలిరాజా.. కామెడీకి ఆయ‌న వెంకీ.. న‌ట‌న‌కు ఆయ‌నే ధ‌ర్మ‌చ‌క్రం.. ఫ్యామిలీ సినిమాలకు ఆయ‌న ఓ అన్న‌య్య‌.. జోన‌ర్ ఏదైనా దుమ్ము దులిపేయ‌డానికి సిద్ధంగా ఉండే గ‌ణేష్.. మొత్తంగా నంది వ‌ర్ధ‌నాలు కురిపించే న‌టుడు.. అత‌డే వ‌న్ అండ్ ఓన్లీ వెంక‌టేశ్. డిసెంబ‌ర్ 13 వెంకీ పుట్టిన‌రోజు. 58వ ఏట అడుగు పెడుతున్నాడు వెంక‌టేశ్. రామానాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. స్టార్ హీరోగా ఎదిగాడు వెంక‌టేశ్. నిర్మాత కొడుకు స్టార్ అవ్వ‌డం అప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌ర‌గ‌లేదు. కానీ ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత అన్నీ మారాయి. వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీకి జోరు నేర్పించాడు వెంక‌టేశ్. తొలి సినిమా క‌లియుగ పాండ‌వులుతోనే సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు వెంక‌టేశ్. ఆ త‌ర్వాత ఒంటరి పోరాటం.. స్వ‌ర్ణ‌క‌మ‌లం లాంటి సినిమాల‌తో 80వ ద‌శ‌కంలో స‌త్తా చూపించాడు. ఇక 90ల్లో వెంకీ జోరుకు బ్రేకులే లేకుండా పోయాయి. బొబ్బిలిరాజా.. చంటి.. ధ‌ర్మ‌చ‌క్రం.. ప్రేమించుకుందాం రా.. పెళ్లిచేసుకుందాం.. క‌లిసుందాం రా.. జ‌యం మ‌న‌దేరా.. మ‌ల్లీశ్వరి.. నువ్వు నాకు న‌చ్చావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకీ సాధించిన విజ‌యాలెన్నో. ఆయ‌న‌కు ఉన్నంత స‌క్సెస్ రేట్ తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రే హీరోకు లేదు. అందుకే అభిమానులు కూడా అత‌న్ని విక్ట‌రీ వెంక‌టేశ్ అంటారు. ఈ మ‌ధ్య కాస్త జోరు త‌గ్గించినా కూడా ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు వెంక‌టేశ్. ఈ న‌టుడు ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆశిద్ధాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here