తాజా వార్తలు ఫీచర్ న్యూస్

బాలీవుడ్ యాక్టర్ తో రవితేజ ఫైట్ 

Date: April 21, 2017 10:53 am | Posted By:
మాస్ మహారాజ రవితేజ తన రాబోయే సినిమా, రాజా ది గ్రేట్ షూటింగ్ డార్జీలింగ్ లో జరుపుకుంటున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు డైరెక్టర్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా రవితేజతో రొమాన్స్ చేయనున్న ఈ సినిమాను దిల్...

fredddy-daruwala

మాస్ మహారాజ రవితేజ తన రాబోయే సినిమా, రాజా ది గ్రేట్ షూటింగ్ డార్జీలింగ్ లో జరుపుకుంటున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు డైరెక్టర్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా రవితేజతో రొమాన్స్ చేయనున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత రవితేజ మరో సినిమా, టచ్ చేసి చూడు షూటింగ్ కొనసాగించనున్నాడు.

బాలీవుడ్ యాక్టర్ ఫ్రెడ్డీ దరువాలా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ఎంపికయ్యాడు. దరువాలా హాలిడే, ఫోర్స్ 2 మరియు కమెండో 2 లాంటి చిత్రాల్లో కనిపించాడు. టచ్ చేసి చూడులో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి మరియు వల్లభనేని వంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY