బాలకృష్ణుడు రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

తారాగణం: నారా రోహిత్, రెజినా కస్సాన్ద్రా
దర్శకుడు: పవన్ మల్లెల
సంగీతం: మణిశర్మ
నిర్మాత: బి మహేంద్ర బాబు, ముసునూరు వంశి, శ్రీ వినోద్ నందమూరి
కథ:
బాలు (రోహిత్) డబ్బులకోసం ఏమైనా చేసే ఓ రౌడీ. ఆధ్య(రెజినా) ను శత్రువుల భారీ నుండి రక్షించేందుకు ఆమె అత్త (రమ్య) బాలును నియమిస్తుంది. ఈ క్రమంలో బాలు, ఆద్య ప్రేమలో పడతారు. ఇదిలా ఉండగా, బాలు కిరాతక ఫ్యాక్షనిస్ట్ అయిన ప్రతాప్ రెడ్డి (అజయ్) తో గొడవ పడతాడు. ఆద్య ను చంపాలని చూసేది ప్రతాపేనని తెలుసుకొని అతడి దగ్గరనుండి కాపాడి అత్తదగ్గరకు భద్రంగా తీసుకువెళ్లే భాద్యత స్వీకరిస్తాడు.
కథనం:
బాలకృష్ణుడు ఓ రెగ్యులర్ కమర్షియల్ చిత్రమే. నారా రోహిత్ పూర్తి స్థాయి మాస్ పాత్ర చేసాడు. చిత్రం చాల వరకు కార్ చెసింగ్లు, యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. ప్రధార్థం వెన్నెల కిశోరె, పృథ్వి కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అజయ్, రమ్య కృష్ణ ల ఫ్యాక్షన్ వైరం సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. నారా రోహిత్, రెజినా మధ్య రొమాన్స్ బాగా పండింది. పెద్దగా ట్విస్టులు లేకుండా ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత చిత్రం దారి తెన్నూ లేకుండా అక్కడక్కడే తిరిగి బోర్ కొట్టిస్తుంది.
పెర్ఫార్మన్స్:
నారా రోహిత్ మాస్ పాత్రను అద్భుతంగా చేసాడు. బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంది. తెలంగాణ, రాయలసీమ యాసలో డైలాగులు అదరకొట్టాడు. రెజినా మితిమీరిన స్కిన్ షో తో రంజింపచేస్తుంది. తన చుట్టూ తిరిగే పాత్రలో బాగానే చేసింది. పృద్వి కామెడీ చిత్రాన్ని ఆదుకుందనే చెప్పాలి. వెన్నెల కిషోర్ కొంతమేర నవ్విస్తాడు. విల్లన్ గా అజయ్ మెప్పిస్తాడు. తాగుబోతు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, రఘు బాబు ఉన్న వారి సన్నివేశాలు అంతగా కామెడీ పలకలేదు.
సాంకేతిక విలువలు:
మణిశర్మ సంగీతం చిత్రానికి మెయిన్ హైలైట్. చప్పగా ఉన్న సన్నివేశాలను తన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో అదరగొట్టాడు. మాస్ పాటలు జుర్రుతులూగిస్తాయి ముఖ్యంగా ‘అర్ధరాత్రి సూరీడు’ అనే పాట చిందులేయిస్తుంది. ఛాయాగ్రహం పర్వాలేదనిపిస్తుంది.
చివరి మాట: రొటీన్ మాస్ మసాలా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here