ప్రివ్యూ: స‌మంత యు ట‌ర్న్..

పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల‌లో మార్పు వ‌స్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. చైతూతో పెళ్లి త‌ర్వాత స‌మంత సినిమాల ఎంపిక‌లో చాలా మార్పు వ‌చ్చింది. గ్లామ‌ర్ షో చేస్తూనే.. మ‌రోవైపు గుర్తుండిపోయే పాత్ర‌ల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాగూ పెళ్లైన త‌ర్వాత గ్లామ‌ర్ పండించే హీరోయిన్ అవ‌కాశాలు రావ‌ని స‌మంత‌కు తెలుసు.
u-turn
అందుకే విభిన్న‌మైన పాత్ర‌ల వైపు వెళ్తుంది. అలా ఎంచుకున్న క‌థే యు ట‌ర్న్ సినిమా. క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ రీమేక్ లో న‌టించింది ఈ భామ‌. ఒరిజిన‌ల్ ను తెర‌కెక్కించిన ప‌వ‌న్ కుమార్ ఇక్క‌డ కూడా ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 13న భారీ అంచ‌నాల‌తో వినాయ‌క‌చ‌వితి కానుక‌గా యు ట‌ర్న్ వ‌స్తుంది. ఇండియాలో 500.. ఓవ‌ర్సీస్ లో 100 స్క్రీన్స్ లో విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా ఈ సినిమా తెర‌కెక్కింది.
ఇందులో స‌మంత సీరియ‌స్ న‌ట‌న‌తో అదుర్స్ అనిపించింది.
ఎందుకో తెలియ‌దు కానీ ముందు నుంచి కూడా ఈ చిత్రంపై చాలా ఆస‌క్తితో ఉంది స‌మంత‌. యుట‌ర్న్ రీమేక్ మ‌రో హీరోయిన్ తో చేయాల‌నుకున్నా కూడా ఆపి మ‌రీ తానే ఈ చిత్రంలో న‌టించింది. ప్ర‌మోష‌న్ కూడా ఓ రేంజ్ లో చేసుకుంటుంది. దానికి తోడు విడుద‌ల‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ కూడా వ‌చ్చాయి. 16 కోట్ల బిజినెస్ జ‌రిగితే అందులో 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చింద‌ని తెలుస్తుంది. 2016లో క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. అప్ప‌ట్లో చైతూతో క‌లిసి బెంగ‌ళూర్ వెళ్లి ప్ర‌త్యేకంగా ఓ షో చూసి వ‌చ్చింది ఈ భామ‌. ఇక ఇప్పుడు యు ట‌ర్న్ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు మార్చి మ‌న ద‌గ్గ‌రికి తీసుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆది ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శైల‌జారెడ్డి అల్లుడుకు పోటీగా యు ట‌ర్న్ వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. భ‌ర్త‌తో భార్య పోరు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here