తాజా వార్తలు

ప్రసాద్ లాబ్స్ లో గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్ గ్రాండ్ ఫినాలే

Date: July 17, 2017 03:26 pm | Posted By:
మహాతల్లి, పెళ్లి గోల, “pill A ”  వంటి అనేక వినోదాత్మక వెబ్ సిరీస్ లను అందిస్తూ సోషల్ మీడియాలో 600 పైగా యూట్యూబ్ ఛానల్స్ ని విజయవంతంగా నిర్వహిస్తూ, తమకంటూ ఓ ప్రత్యక స్థాన్నాన్ని కైవశం చేసుకున్న Tamada...

మహాతల్లి, పెళ్లి గోల, “pill A ”  వంటి అనేక వినోదాత్మక వెబ్ సిరీస్ లను అందిస్తూ సోషల్ మీడియాలో 600 పైగా యూట్యూబ్ ఛానల్స్ ని విజయవంతంగా నిర్వహిస్తూ, తమకంటూ ఓ ప్రత్యక స్థాన్నాన్ని కైవశం చేసుకున్న Tamada Media వారు నిర్మించిన గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్ నెటిజనులు విశేషంగా ఆకట్టుకుంటోంది. శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ  వినోదాత్మక వెబ్ సిరీస్ wirally వెబ్ ఛానెల్లో వారం వారం రిలీజ్ అవుతూ సంచలనం సృష్టించింది. మనోజ్ కృష్ణ, దర్శిని శేఖర్ టైటిల్ రోల్స్ పోషించిన ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ వన్ మిలియన్ వ్యూస్ కి చేరువై.. దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా 25 మిలియన్ వ్యూస్ రాబట్టిందని నిర్మాతలు రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బుర్రా తెలిపారు. శనివారం(15 ) సాయంత్రం ఆరుగంటలకు ప్రసాద్ లాబ్స్ లో  గీతా సుబ్రమణ్యం గ్రాండ్ ఫినాలే ను సినీ ప్రముఖల సమక్షంలో ప్రదర్శించారు.  ​

Categories
తాజా వార్తలు