పైసా వసూల్ రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

పైసా వసూల్ – ఫాన్స్ కి పండగ

Rating: 2.75/5

Release Date : 09/01/2017

తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, కైర దత్, అలీ, పృథ్వి, విక్రంజీత్ విర్క్

దర్శకత్వం: పూరి జగన్నాధ్

సంగీతం: అనూప్ రూబెన్స్

నిర్మాత: ఆనంద్ ప్రసాద్

బ్యానర్: భవ్య క్రియేషన్స్

కథ:

తేడా సింగ్ (బాలకృష్ణ) తీహార్ జైలు నుండి విడుదలైన ఖైదీ. తేడా సింగ్ తెగువకు మెచ్చి పోలీసు అధికారిని అయిన కైరా దత్ అతనికి బాబ్ మార్లే అనే అంతర్జాతీయ డాన్ ను చంపమని సుపారీ కుదుర్చుకుంటారు. అయితే తర్వాత తెలుస్తుంది, తేడా సింగ్ పోర్చుగల్ లో కైరా అక్క అయిన సారిక (శ్రియ) ప్రేమికుడని, ఆమెను హత్య చేసి పరారీ లో ఉన్నాడని. సారిక ఎవరు? నిజంగానే తేడా సింగ్ ఆమెను చంపాడా? బాబ్ మార్లితో ఎలా తలపడతాడు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే పైసా వసూల్ తెర మీద చూడాలిసిందే.

రివ్యూ:

పైసా వసూల్ పూరి జగన్నాధ్ గత సినిమాల కథనే అటు ఇటు తిప్పి మల్లి చూపించాడు. అయితే బాలకృష్ణ ను కొత్తగా చూపించడంలో విజయం సాధించాడని చెప్పాలి. ఆయన వంద చిత్రాల్లో ఎన్నడూ చూడని వైవిధ్యమైన నటన హావ భావాలూ ప్రదర్శించారు బాలయ్య. పూరి రాసిన క్రేజీ డైలాగ్స్ బాలయ్య నోటా పలుకుతుంటే ఫ్యాన్స్ కి పండగే. థియేటర్ల లో విజిల్లా మోత మోగిపోద్ది. అయితే పూరి పాత ఫార్ములా అయిన హీరో ఓ జులాయి లా ప్రవర్తిస్తూ చివరికి క్రిమినల్స్ ను ఏరిపారేసే మిషన్ మీద ఉన్న సీక్రెట్ పోలీసు ఆఫీసర్ అని చూపడం బోర్ కొట్టిస్తుంది. కథనం లో కూడా పెద్ద కొత్తదనం లేకపోవడం చిత్రం ప్రధాన లోపం.

ప్రథమార్ధం బాలయ్య ఎనర్జీ, పంచ్ డైలాగులతో సరదాగా సాగిపోతుంది. “నాకు మాన్షన్ హౌస్ తప్ప ఎం తెలీదు” అని బాలయ్య అంటే ఫ్యాన్స్ రచ్చ చేయకమన్నారు. ద్వితీయార్ధం పోర్చుగల్ లో శ్రియ తో రొమాన్స్, విల్లన్ ల తో ఫైట్లు, కార్ చేసింగ్ సీన్ లు బాగానే ఉన్నా, ముందే ఊహించే లా ఉండటం తో పెద్దగా ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ మరీ రొటీన్ గా ఉంటుంది. పూరి ఇక కథలు రాయడం మానేసి, కేవలం డైలాగులు రాయడం బెటర్ అనిపిస్తుంది. బాలకృష్ణ నటన సినిమాకు హైలైట్. ఆయన చేసిన కామెడీ కి పృద్వి, అలీలు ఉన్నాఅవసరంలేనట్లు అయ్యింది. ముస్కాన్ అందాల ఆరబోతకే పరిమితమయ్యింది. సింపతీ కలింగించే పాత్రలో శ్రియ బాగా చేసింది. పోలీసు గా కైరా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ బాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు చిత్రానికి పెద్ద అసెట్ గా నిలుస్తాయి. ఫైట్లు చొంపొసింగ్ కూడా బాగున్నాయి.

ప్లస్:

బాలకృష్ణ కొత్త తరహా నటన

డైలాగ్స్

సంగీతం

మైనస్:

రొటీన్ కథ, కథనం

బోర్ కొట్టించే కండ్ హాఫ్

క్లైమాక్స్

చివరి మాట: పైసా వసూల్ – ఫాన్స్ కి పండగ