పాప‌కు ఇంకేం ప‌ని లేన‌ట్లుంది..!

క‌రిష్మా శ‌ర్మ‌ను చూస్తుంటే ఇదే అడ‌గాల‌నిపిస్తుంది మ‌రి. కొంద‌రు హీరోయిన్ల‌కు సినిమాలు.. అవ‌కాశాల‌తో ప‌నిలేదు. వాళ్లు అనుకున్న‌ది చేస్తారు.. చేస్తూ పోతుంటారంతే. వాళ్ల‌కు అవ‌కాశాలు ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా.. పెద్ద‌గా తేడా ఏమీ ఉండ‌దు. క‌రిష్మా శ‌ర్మ కూడా ఆ లిస్ట్ లోకే వ‌స్తుంది.

రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్ అనే వెబ్ సిరీస్ తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ భామ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే అవ‌స‌రం లేద‌నే బాపతు ఈ భామ‌ది. ఎప్పుడూ అందాలు ఆర‌బోయడ‌మే ప‌నిగా పెట్టుకుంటుంది. సినిమాలు.. బ‌య‌ట అనే తేడాలస‌లే ఉండ‌వు ఈ భామ‌కి. సామాజిక న్యాయం చేస్తుంటుంది. డ‌బ్బులు తీసుకుని స్క్రీన్ పై అందాల‌న్నీ ఆర‌బోస్తుంది. అభిమానుల కోసం ఫ్రీగా బ‌య‌ట అందాలు ఒడియాల్లో బ‌య‌ట‌పెడుతుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. స‌మ్మ‌ర్ క‌దా..

క్యాస్ట్యూమ్ మ‌రీ హెవీగా వేసుకుంటే చెమ‌ట‌లు ప‌డ‌తాయేమో అని బికినీతో చూసేవాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. అందాల‌ను కెమెరాల‌కు వ‌దిలేసి హాయిగా రెచ్చ‌గొట్టేస్తుంది క‌రిష్మా. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భామ అందాల‌న్నీ కేవ‌లం బుల్లితెర‌పై ప‌రిమితం అయ్యాయి. త్వ‌ర‌లోనే వెండితెర‌పై కూడా క‌రిష్మా శ‌ర్మ ర‌చ్చ చేయ‌బోతుంది. ఇప్ప‌టికే ఓ బాలీవుడ్ సినిమా కోసం ఈ భామ‌ను తీసుకున్నారు. మొత్తానికి అంద‌మే ఆయుధంగా అడుగేస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యూచ‌ర్ లో మ‌రెన్ని థ‌ర్మామీట‌ర్లు పేలిపోయేలా చేస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here