పాపం.. ఇర్ఫాన్ అలా అయ్యాడేంటి..?

ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు అని కొంద‌ర్ని చూసి బాధ ప‌డుతుంటాం క‌దా.. ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పాపం ఒక‌ప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడో అని. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కంటిముందు తిరిగిన వ్య‌క్తి.. సినిమాల్లో హాయిగా న‌టించిన వ్య‌క్తి ఇప్పుడు స‌డ‌న్ గా హాస్పిట‌ల్ బెడ్డు మీదున్నాడు. అస‌లు జీవితం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా ప‌రీక్షిస్తుందో చెప్ప‌డం క‌ష్టం.

ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. 51 ఏళ్ల ఈ న‌టుడు అరుదైన క్యాన్స‌ర్ వ్యాధితో బాధ ప‌డుతున్నాడు. చివ‌రి స్టేజ్ వ‌ర‌కు కూడా బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. లండ‌న్ లోని ఓ హాస్పిట‌ల్ లో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నాడు. ఇర్ఫాన్ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంద‌ని చెబుతున్నా.. ఆయ‌న ఫోటో చూస్తుంటే మాత్రం చాలా పీల‌గా మారిపోయి స‌న్న‌గా అయిపోయాడు. ఇది చూసిన త‌ర్వాత అభిమానుల్లో టెన్ష‌న్ పెరిగిపోతుంది.

ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫోటోలో మ‌రీ బ‌క్క‌చిక్కిపోయి క‌నిపించాడు ఇర్ఫాన్. న‌వ్వుతూ క‌నిపిస్తున్నా ఆ న‌వ్వు వెన‌క బాధ కూడా క‌నిపిస్తుంది. ఈ ఫోటో చూసాకే ఫ్యాన్స్ క‌న్నీరు పెట్టుకుంటున్నారు. చితిక్స అందుతున్నా ఇప్ప‌టికీ ఆయ‌న ఆరోగ్యం మాత్రం విష‌మంగానే ఉన్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు ఇర్ఫాన్ కూడా త‌న ఆరోగ్యంపై వ‌స్తోన్న వార్త‌ల్ని ధృవీక‌రించాడు.

దేవున్ని ప్రార్థించండంటూ కోరుకుంటున్నాడు. ఈ క‌ష్ట కాలంలో ఈయ‌న‌కు సన్నిహితులు.. స‌హ‌చ‌ర న‌టులు.. స్నేహితులు అండగా నిల‌బ‌డుతున్నారు. మ‌రో నెల రోజుల్లోనే ఇర్ఫాన్ జీవితం ముగుస్తుంద‌ని కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇది నిజం కాద‌ని.. విష‌మంగా ఉన్న‌ది నిజ‌మే అయినా రోజులు మాత్రం కాద‌ని ఇర్ఫాన్ స‌న్నిహితులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో కూడా ఇర్ఫాన్ ఖాన్ మ‌నో ధైర్యంతో ముందుకెళ్తున్నాడని తెలిపారు. ఆయ‌న ఆరోగ్యం వీలైనంత త్వ‌ర‌గా న‌య‌మ‌వ్వాల‌ని ఆ దేవున్ని ప్రార్థిద్ధాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here