Telugu తాజా వార్తలు ఫీచర్ న్యూస్

పవన్ కళ్యాణ్ మళ్ళి హ్యాండ్ ఇచ్చినట్లేనా?

Date: August 12, 2017 05:08 pm | Posted By:
పవన్ కళ్యాణ్ రెండు పడవల పై ప్రయాణం చేస్తూ ఎటు న్యాయం చేయలేక పోతున్నాడట. ఇటు చిత్రాలు శరవేగం గా పూర్తి చేయాలన్న తొందర వల్ల ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మరియు ‘కాటంరాయుడు’ రెండు చిత్రాలు బోల్తా పడ్డాయి....

పవన్ కళ్యాణ్ రెండు పడవల పై ప్రయాణం చేస్తూ ఎటు న్యాయం చేయలేక పోతున్నాడట. ఇటు చిత్రాలు శరవేగం గా పూర్తి చేయాలన్న తొందర వల్ల ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మరియు ‘కాటంరాయుడు’ రెండు చిత్రాలు బోల్తా పడ్డాయి. అటు రాజకీయాల్లో ను అదే పరిస్థితి కనపడుతుందని అంటున్నారు విశ్లేషకులు. పవన్ జన సేన పార్టీ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని తలచిన కుదరలేదు. నంద్యాల బై-ఎలక్షన్ విషయంలోనూ పవన్ ముందడుగు వేయడానికి సంశయించాడు. రాబోవు కాకినాడ మునిసిపల్ ఎన్నికల విషయం పై కూడా పవన్ ఇంతవరుకు స్పందించ లేదు.

ఈ మధ్య పార్టీ లీడర్లను పరీక్ష నిర్వహించి మరీ నియోజక వర్గాల వారీగా నియమించాడు కూడా. అయినా పవన్ ఎలక్షన్ విషయం వచ్చే సరికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడో అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు. 2019 ఎన్నికలకు రెండు సంవత్సరాల కంటే తక్కువ గడువు ఉన్న తరుణంలో ఇంకా టి.డి.పి తో పొత్తు ఉన్నది లేనిది క్లారిటీగా చెప్పక పోవడం కూడా పవన్ అభిమానులను, అనుచరులను తిక-మకకు గురిచేస్తుందని భావిస్తున్నారంతా. పవన్ డైలెమాలో ఉన్నాడని, ఇటు సినిమాలకి అటు రాజకీయాలకి న్యాయం చేయలేకపోతున్నాడని వాపోతున్నారు అభిమానులు.

Categories
Teluguతాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY