పవన్ కళ్యాణ్ పేరు మార్చుకున్నాడని సామజిక మాధ్యమంలో నిన్నటినుండి విరివిగా ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ పేరు కుషాల్ బాబు గా మార్చుకున్నాడని, త్వరలో ఆయన మతం కూడా మార్చుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనంతటికి కారణం, పవన్ వికీపీడియా పేజీ లో ఎవరు ఆగంతకుడు హ్యాక్ చేసి ఆయన పేరును కుషాల్ బాబు గా మార్చడమే. అయితే పవన్ దగ్గరి వర్గాలు ఈ వార్తను ఖండించాయి. కొన్ని రోజుల క్రితం పవన్ ఆధార్ కార్డు ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన వయసు 50 అని ఫేక్ ఆధార్ సృష్టించి గిట్టని వాళ్ళు సామజిక మధయ్మంలో ప్రచారం చేసారని తర్వాత తెలిసింది. ఈ క్రమంలో ఇటీవలే పవన్ జన సేన పార్టీ ప్రచారం కోసం సామజిక మద్యం టీం ను ఎంపిక చేసి ఆ టీం కు శతాగ్ని అని పేరు పెట్టారు. ఇంత లోపు ఇలా జరగడం చర్చనీయాంశం అయ్యింది.