పడమటి సంధ్యారాగం లండన్ లో రివ్యూ

MOVIE METER

Average Rating: 2
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

లండన్ లో మూగబోయిన పడమటి సంధ్యారాగం

Rating: 1.5/5

http://www.teluguodu.com/

Release Date : 01/06/2017

నటులు : చైతు శాంతారాం , షాహీల రాణి , లండన్ గణేష్ , ఫిరోజ్ షేక్ , ధీరజ్ తోట
డైరెక్టర్ : వంశీ మునిగంటి
సంగీతం : కేశవ కిరణ్
నిర్మాత : లండన్ గణేష్
కథ :
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐన అరవింద్ లండన్ లో పని చేసే అవకాశం వస్తుంది . ఈ ప్రయాణములో అరవింద్ తన కళల రాణిని కలుసుకుంటాడు. తన ప్రేమను వేక్తపరచే ప్రయత్నం చేస్తాడు. అయితే లండన్ లో దిగగానే వీరి ఊరి వాళ్లమని పేరు చెప్పి కొందరు ఇద్దరినీ మోసంచేస్తారు . ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఉన్న వీరికి అమూల్య సహాయం చేసే ప్రయత్నంచేస్తుంది . అంతే కాకుండా వీరు లండన్ లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అరవింద్ మరియు అమూల్య ఇద్దరూ ఈ పరిస్థితులలో దగ్గరవ్వడం జరుగుతుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య అరవింద్ అమూల్యాకు తన ప్రేమ గురించి చెప్తాడా ? అరవింద్ తన కళల రాణిని చేరుకుంటాడా ? అమూల్యాను చేరుకుంటాడా ? వంటి విషయాలు తెలుసుకోవాలంటే తెర మీద పడమటి సంధ్యారాగం లండన్ లో  సినిమా చూడాల్సిందే …!
సమీక్ష :
ఈ సినిమాకు సంబందించిన షూట్ మొత్తం లండన్ లోనే జరుపుకుంది . ఈ సినిమా కథ ఎటువంటి కొత్తదనాన్ని పరిచయం చేయలేకపోయింది అనిచెప్పాలి . ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకూ వచ్చిన కథలలో ఇది కూడా ఒకటి అనిఅనుకోవాలి . స్క్రీన్ ప్లే లేకపోవడం మరియు అనుకోకుండా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రేక్షకులకు బోర్ కొట్టేలా అనిపిస్తాయి. కాస్త లండన్ లోని ప్రదేశాలను చూస్తూ మొదటి భాగం అలా గడిచిపోతుంది కానీ రెండవ భాగం మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది అని చెప్పాలి. నటులు తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ అనుభవ లేమితో అభినయం ఆశించినంత రీతిలో రాలేకపోయింది. అంతే కాకుండా లీడ్ మేల్ మరియు ఫిమేల్ మధ్య కెమిస్ట్రీ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు . కేశవ కిరణ్ అందించిన సంగీతం పరవాలేదనిపించినప్పటికీ సినిమా విజయం మీద పెద్దగా ప్రభావం చూపలేదు అని చెప్పాలి.
బాగున్నవి :
చిత్రీకరించిన ప్రదేశాలు
బాగాలేనివి :
కథ
స్క్రీన్ ప్లే
నటులు
దర్శకత్వం
మొత్తం మీద : లండన్ లో మూగబోయిన పడమటి సంధ్యారాగం