పంతం ట్రైల‌ర్.. మ‌రో ఠాగూరా..?

Pantham trailer

గోపీచంద్ కు ఇప్పుడు విజ‌యం త‌ప్ప‌నిస‌రిగా కావాలి. లౌక్యం వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ కొట్ట‌లేదు ఈ హీరో. ఆ సినిమా 20 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి గోపీ మార్కెట్ పెంచేసింది. ఆ త‌ర్వాత జిల్.. ఆక్సీజ‌న్.. గౌత‌మ్ నందా లాంటి డిజాస్ట‌ర్లు వ‌చ్చి గోపీచంద్ ఇమేజ్ మ‌రోసారి త‌గ్గించేసాయి. ఇప్పుడు కానీ అర్జంట్ గా హిట్ కొట్ట‌క‌పోతే ఈ హీరోను మ‌రిచిపోయే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. ఇలాంటి టైమ్ ఈయ‌న త‌న పంతం చూపించ‌డానికి వ‌స్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే ఈ సారేదో గ‌ట్టి పంతంతోనే వ‌స్తున్నాడు గోపీచంద్. పైగా సోష‌ల్ మెసేజ్ కూడా తీసుకొస్తున్నాడు.

లంచాలు తీసుకుని.. ఓట్ల‌ను అమ్ముకుని క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నాడు ఈ హీరో. అవినీతి ప‌రుడైన రాజ‌కీయ నాయకున్ని అరెస్ట్ చేస్తే వాడి కోసం ధ‌ర్నాలు చేస్తారు.. వాడు దోచేస్తుంది మీ అన్నాన్ని.. ఆక‌లిని అంటూ సీరియ‌స్ డైలాగులు కొట్టాడు. ఇదంతా చూస్తుంటే భారీ ప్లాన్ తోనే వ‌స్తున్న‌ట్లు అర్థ‌మైపోతుంది. బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ కేకే రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో గోపీచంద్ ఫామ్ లోకి వ‌స్తాడో లేదంటే మ‌రోసారి అక్క‌డే ఆగిపోతాడో..? అన్న‌ట్లు ఈ చిత్రాన్ని ముందు ర‌వితేజ‌తో ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు చ‌క్రి.. ఆయ‌న మిస్ అయ్యాడు దాంతో గోపీచంద్ వ‌ర్కవుట్ అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here