న‌ర్త‌న‌శాల‌.. రెడీ టూ రిలీజ్..!

అదేంటి.. మొన్నే క‌దా సినిమా మొద‌లుపెట్టింది అప్పుడే విడుద‌ల‌కు సిద్ధం అవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. కాక‌పోతే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది సినిమా కాదు.. ఫ‌స్ట్ లుక్. నాగ‌శౌర్య ఫ‌స్ట్ లుక్ ను జులై 20 సాయంత్రం 6.30 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతు న్నారు. ఇదే విష‌యాన్ని పోస్ట‌ర్ వేసి మ‌రీ చెప్పారు.
న‌ర్త‌న‌శాల టైటిల్ తో ఒక‌ప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసాడు. త‌ర్వాత బాల‌య్య స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్లాన్ చేసి ఆపేసాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు నాగ‌శౌర్య ఇదే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న సొంత బ్యాన‌ర్ లోనే ఈ చిత్రం చేయ‌బోతున్నాడు శౌర్య‌.
ఒక్క‌సారి గెలుపు రుచికి అల‌వాటు ప‌డిన త‌ర్వాత వెన‌క్కి రావ‌డం క‌ష్టం. ఇన్నాళ్లూ నాగ‌శౌర్య‌కు అది ఎలా ఉంటుందో పెద్ద‌గా తెలియ‌దు. వ‌చ్చిన స‌క్సెస్ లు కూడా అర‌కొర‌గానే వ‌చ్చాయి. ఈ మ‌ధ్యే ఛ‌లోతో నిఖార్సైన విజ‌యం అందుకున్నాడు నాగ‌శౌర్య‌. అది కూడా సొంత బ్యాన‌ర్ లోనే. ఐరా సంస్థ అంటూ ఒక‌టి క్రియేట్ చేసి.. అందులోనే సినిమా చేసాడు శౌర్య‌. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.
మంచి లాభాలు తీసుకొచ్చింది. బ‌య‌టి బ్యాన‌ర్స్ లో చేయ‌డం వ‌ల్ల త‌న సినిమాలు స‌రైన ప్ర‌మోష‌న్ లేక పోయాయంటున్నాడు శౌర్య‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన జాదూగాడు.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలు పోవ‌డానికి కార‌ణాలు స‌రైన టైమ్ లో రిలీజ్ కాక‌పోవ‌డ‌మే అంటున్నాడు శౌర్య‌. అందుకే సొంతబ్యాన‌ర్ లోనే వ‌ర‌స‌ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి మ‌రి ఛ‌లోతో వ‌చ్చిన స‌క్సెస్ ను నర్త‌న‌శాల‌తో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here