నో డౌట్.. క్రిష్ ను కావాల‌నే ఇరికించారు..!

అస‌లే అవి బాలీవుడ్ రాజ‌కీయాలు.. అక్క‌డ సినిమా పోయినా ప‌ర్లేదు కానీ త‌మ ఇగోలు మాత్రం సాటిస్ ఫై అవ్వాల‌నుకునే వాళ్లుంటారు. అందుకే అప్పుడప్పుడూ పెద్ద సినిమాలు కూడా ఏళ్ల‌కేళ్లు బాక్సుల్లోనే ఉంటాయి కానీ బ‌య‌టికి రావు. అమితాబ్, షారుక్ లాంటి సూప‌ర్ స్టార్స్ కు కూడా త‌ప్ప‌లేదు ఈ తిప్ప‌లు. అలాంటిది కంగ‌న ర‌నౌత్ ఎంత‌..? ఈమె కూడా ఇప్పుడు ఇలాంటి బాధ‌ల్నే ప‌డుతుంది. అయితే ఈమె చేస్తున్న పనుల‌తో ఇప్పుడు పాపం ఏం తెలియ‌ని క్రిష్ మ‌ధ్య‌లో ఇరుక్కుపోయాడు. మ‌ణిక‌ర్ణిక సినిమా ఒప్పుకోవ‌డ‌మే క్రిష్ చేసిన పాపంగా మారిందిప్పుడు. అనుకున్న ప్ర‌కారం ఎప్పుడో ఈ చిత‌త్ర షూటింగ్ పూర్తి చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

KRISH-MANIKARNIKA

కానీ ఇప్పుడు మ‌ళ్లీ రీ షూట్ చేస్తూ కంగ‌న‌నే స్వ‌యంగా డైరెక్ట్ చేసుకుంటుంది. డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర క్రిష్ కాకుండా కంగ‌న పేరు క‌నిపిస్తుంది. దాంతో ఇప్పుడు క్రిష్ ను కావాల‌నే ఇరికించిన‌ట్లుగా అనిపిస్తుంది. ఒక‌వేళ హిట్ అయితే ఓకే కానీ ఫ్లాప్ అయితే మాత్రం క‌చ్చితంగా క్రిష్ చేసాడ‌నే చెడ్డ‌పేరు వ‌స్తుంది.

ఇప్ప‌టికే శాత‌క‌ర్ణి బ‌యోపిక్ చేసిన క్రిష్.. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాడు. దీనికి ముందే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ మ‌ణిక‌ర్ణిక బాధ్య‌త కూడా తీసుకున్నాడు. ఈ సినిమాను కూడా అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. స్టిల్స్ చూస్తుంటేనే సినిమా రేంజ్ అర్థ‌మైపోతుంది. కంగ‌నా ఇందులో హీరోయిన్. అయితే ఇప్పుడు మాత్రం కంగ‌న చేస్తున్న రాజ‌కీయాల‌కు క్రిష్ బ‌లైపోతున్నాడు. అందుకే ఈయ‌న కూడా ఈ సినిమా గురించి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను పూర్తి చేసుకుని వ‌చ్చాన‌ని చెప్పుకుంటున్నాడు.

మిగిలిన ప‌నుల‌న్నీ కావాల‌నే క్రిష్ ను ప‌క్క‌న‌బెట్టేసి కంగ‌న‌నే చేస్తూ పోతుంది. దానివల్ల సినిమాకు న‌ష్టం అని తెలిసినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు కంగ‌న‌. తాను చేయాల్సిందంతా ఈ సినిమా కోసం చేసాడు క్రిష్. ఇప్పుడు కావాల‌నే వాళ్లే చెడ‌గొట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే సోనూసూద్ కూడా సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు. మ‌రోవైపు ఈ చిత్రం జ‌న‌వ‌రి 2019, 25న వ‌స్తుందంటున్నాడు క్రిష్. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు మ‌ణిక‌ర్ణిక విష‌యంలో ఇంకా ఎన్ని చిత్రాలు జ‌ర‌గ‌నున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here