నేను లోకల్ రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 4

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

పక్కా లోకల్ మూవీ

Rating: 3/5

www.teluguodu.com

యాటిట్యూడ్ ఉన్న కుర్రోడి ప్రేమ కథ

Rating: 3.25/5

www.123telugu.com

నేను లోక‌ల్‌.. మెప్పిస్తాడు

Rating: 3/5

www.indiaglitz.com

లోకల్ కుర్రాడు.. రొటీన్ గానే ఎంటర్టైన్ చేశాడు

Rating: 3/5

http://www.tupaki.com/

Release Date : 02/03/2017

నటులు : నాని, కీర్తి సురేష్
డైరెక్టర్ : త్రినాథ రావు
నిర్మాత : దిల్ రాజు
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

కథ :

తన కుటుంబసభ్యుల ప్రభావంతో మన హీరో బాబు ఆడుతూ పాడుతూ తన జీవితం సాగిస్తుంటాడు. డిగ్రీ పూర్తిచేసిన తరువాత మనోడు మన హీరోయిన్ ను చూసి ప్రేమలో పడతాడు. తన కోసం అని ఆ అమ్మాయితో పాటుగా ఎంబీఏ చదవటానికి కాలేజీలో చేరతాడు. అయితే మనోడి తింగర వేషాలతో హీరోయిన్ ను మరియు హీరోయిన్ తండ్రిని విసిగిస్తూ ఉంటాడు. ఇలా కొద్దిరోజుల తరువాత ఈ అమ్మడు మనోడి ప్రేమలో పడుతుంది. కానీ హీరోయిన్ తండ్రి మాత్రం వీరి ప్రేమకు వ్యతిరేకంగా ఉంటాడు. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య బాబు తన ప్రేమను గెలిపించుకుంటాడా ? తన మామ తన పెళ్ళికి అంగీకరిస్తాడా ? చివరకు ఏమవుతుంది ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెరమీద నేను లోకల్ సినిమా చూడాల్సిందే !

సమీక్ష :

కథ మరియు కథాంశం ఎప్పటిలాంటిదే అయినప్పటికీ సహజ నటుడిగా పేరున్న మన నాని తన నటన మరియు డైలాగ్ డెలివరీతో సినిమాను తెలుగు ప్రేక్షకులకు చక్కగా పరిచయం చేస్తాడు. నాని ఈ సినిమాకు తప్పకుండా ప్లస్ అని చెప్పాలి. నాని తరువాత పోసాని చేసిన కామెడీ ప్రేక్షకులకు తెగ నవ్వించేసింది. ముఖ్యంగా సినిమా మొదటి భాగంలో పోసాని వేసిన పంచ్ లు బాగా పేలాయని చెప్పాలి. లవర్ బాయ్ గా పేరున్న నాని మరియు కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవ్వడం సినిమా విజయానికి దోహదం చేసే విషయం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు అందుకుంది అంతే కాకుండా సినిమాకు అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు చక్కగా అమరింది అని చెప్పాలి.

సినిమాలోని సన్నివేశాలను అద్భుతంగా తెరెక్కించడంలో సినిమాటోగ్రఫీ వారి పాత్ర ప్రశంసనీయం. మరోపక్క ఎప్పటిలాగే దిల్ రాజు నిర్మాణ సంస్థ వారి నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. కామెడీ మరియు రొమాంటిక్ సన్నివేశాల కలయికతో సినిమా మొదటి భాగం ప్రేక్షకుల మనసు దోచుకొనేలా ఉంది. ఇక కామెడీ పాత్రలలో వెన్నెల కిశోర్, సప్తగిరి మరియు పోసాని కృష్ణమురళి మంచి కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసారని చెప్పాలి. సినిమా రెండవ భాగం ఎప్పటిలాగే ఉన్నా మంచి స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టకుండా జరిగింది. సినిమాలో చివరి 30 నిమిషాలు కాస్త తొందర తొందరగా తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది.

బాగున్నవి :
హీరో
హీరోయిన్
కామెడీ
సాంగ్స్
సినిమాటోగ్రఫీ
బాగాలేనివి :
సేమ్ స్టోరీ
ప్రీ క్లైమాక్స్
మొత్తం మీద : పక్కా లోకల్ మూవీ