నేడు దాస‌రి తొలి వ‌ర్ధంతి..


తెలుగు ఇండ‌స్ట్రీకి దిక్సూచి ఆయ‌న‌.. ద‌ర్శ‌క కులానికి పెద్ద‌.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుండే నాయ‌కుడు.. ఆయ‌న దూర‌మై అప్పుడే ఏడాది అయిపోయిందంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. అత‌డే ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాస‌రి నారాయ‌ణ‌రావు. 2017 మే 30న ఈయ‌న అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఈయ‌న తొలి వ‌ర్ధంతిని ఇండ‌స్ట్రీ గుర్తు చేసుకుని గురువుగారు లేని బాధ పూడ్చ‌లేనిదంటూ ఆయ‌న్ని స్మ‌రించుకుంటున్నారు.
ఈ ఇండ‌స్ట్రీ అంతా ఆయ‌న‌దే.. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే న‌డుచుకునే వాళ్లు. దాస‌రి ఉన్న‌పుడు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండేవి కావు. ఇంటికి పెద్ద‌న్న‌లా.. ఇండ‌స్ట్రీకి ఓ పెద్ద‌న్నై ఉండేవాడు ఈయ‌న. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాతే ఇండ‌స్ట్రీలో అస‌లు లుక‌లుక‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. అస‌లు శ్రీ‌రెడ్డి, క‌త్తిల ఇష్యూలు కూడా దాస‌రి ఉండుంటే అంత దూరం వ‌చ్చుండేవి కావ‌ని చాలా మంది అన్నారు.
అది దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌త్యేక‌థ‌. ద‌ర్శ‌కుడిగా 151 సినిమాలు.. న‌టుడిగా 70 సినిమాలు.. నిర్మాత‌గా 30 సినిమాల‌కు పైగా నిర్మించిన దాస‌రి.. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. ఆయ‌న్ని ఎప్పుడూ మ‌ర‌వ‌డం సాధ్యం కాదు. ఏ ద‌ర్శ‌కుడు ఏ సినిమా చేసినా అందులో దాస‌రి క‌నిపిస్తుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here