నూర్ రివ్యూ

MOVIE METER

Average Rating: 2
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

సోనాక్షి ఫాన్స్ కి మాత్రమే

Rating: 1.75/5

http://www.teluguodu.com

Release Date : 04/21/2017

 

నటులు : సోనాక్షి సిన్హా , పూరబ్ కోహిల్
డైరెక్టర్ : సునీల్ శిపీ

కథ :

ఎప్పుడు చిన్న చిన్న వార్తలను అందించే విలేకరిగా ఉంటుంది నూర్. ఒక పెద్ద న్యూస్ ను టీవీ లో అందించాలి అని ఆశపడుతుంటుంది. తనతో పాటె ఉన్న ఒక రిపోర్టను ప్రేమిస్తుంది. ఇంతలో తన సోదరుడు అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతుంది. తన సోదరుడి అనారోగ్యానికి సంబంధించి ఒక పెద్ద కారణం ఉండడంతో దానినే తాను స్టోరీ చేయాలనీ అనుకుంటుంది. తన మిత్రుడి సాయంతో ఈ కేసు ను ఛేదించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం మరియు నమ్మకద్రోహానికి గురి అవ్వడం జరుగుతుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య తనకు తెలిసిన న్యూస్ ఏమిటి ? తాను ఎవరిని ఎదుర్కొంటుంది ? చివరకు ఏమి జరుగుతుంది ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెరమీద నూర్ సినిమా చూడాల్సిందే !

సమీక్ష :
ఒక న్యూస్ రిపోర్టర్ న్యూస్ ని అందించడానికి తను ఎదుర్కొనే సమస్యలు మరియు ప్రమాదాల గురించిన సినిమానే ఇది. ప్రఖ్యాత న్యూస్ రిపోర్టర్ బార్క దత్తా నిజ జీవితాన్ని పోలి ఉంటుంది ఈ సినిమా కథ . కథ మరియు కథాంశం సాధారణంగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రమే సినిమాను నడిపించింది అని చెప్పాలి. నూర్ పాత్ర ను అల్లిన విధానం ఈ సినిమా కథకు బలం అని చెప్పవచ్చు. సినిమా మొదటి భాగం మొత్తం తాను చిన్న చిన్న న్యూస్ లు ఇవ్వడం మరియు తన ప్రేమకు సంబందించిన సన్నివేశాలతో నిండి ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కు ముందు ట్విస్ట్ ఉంటుంది. సినిమా రెండవ భాగం మొత్తం స్ట్రింగ్ ఆపరేషన్ మరియు నూర్ ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి.

స్క్రీన్ ప్లే తో కాస్త ప్రయత్నించినప్పటికీ సినిమా మొత్తం ప్లైన్ గా ఉండడంతో పెద్దగా ఆసక్తిగా అనిపించదు అని చెప్పాలి. ఇందులో నూర్ పాత్ర ఒక్కటే సబబుగా అనిపించే విషయం. సోనాక్షి నటన మరియు తన అందంతో సినిమాను లాక్కొచ్చింది అని చెప్పుకోవాలి. ఈ సినిమా లో ముంబై యాసలోని డయలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాయి. సినిమాకు అందించిన సంగీతం మరియు సినిమాటోగ్రఫీ రెండూ పరవాలేదనిపించాయి.

బాగున్నవి :

సోనాక్షి

బాగాలేనివి :

నెమ్మదిగా నడవడం
రెండవ భాగం

మొత్తం మీద : సోనాక్షి ఫాన్స్ కి మాత్రమే