తాజా వార్తలు ఫీచర్ న్యూస్

నితిన్ కోసం పవన్ కళ్యాణ్ టైటిల్

Date: March 20, 2017 12:12 pm | Posted By:
పవన్ కళ్యాణ్ పేరుని నితిన్ వాడినంతగా తన మేనల్లుడు మరియు మెగాహీరోలు కూడా వాడి ఉండరు. పవర్ స్టార్ భక్తుడైన నితిన్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సాంగ్ నుంచి తీసుకున్న గుండెజారి గల్లంతయిందే తో హిట్ కొట్టాడు. ఇప్పుడు,...

pawan-kalyan-trivikram-nithiin

పవన్ కళ్యాణ్ పేరుని నితిన్ వాడినంతగా తన మేనల్లుడు మరియు మెగాహీరోలు కూడా వాడి ఉండరు. పవర్ స్టార్ భక్తుడైన నితిన్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సాంగ్ నుంచి తీసుకున్న గుండెజారి గల్లంతయిందే తో హిట్ కొట్టాడు. ఇప్పుడు, ఈ యంగ్ హీరో పవన్ కళ్యాణ్ టైటిల్ మూవీ పెట్టుకోవాలనుకుంటున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్లో నితిన్ ఒక సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాకు మేకర్స్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ అని తెలిసిందే. నితిన్ ఇప్పుడు ఈ టైటిల్ ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY