నా పెళ్లి బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్న నితిన్.. 

Srinivasa Kalyanam

పిల్ల దొర‌క‌లేదు కానీ అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు నితిన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా టాలీవుడ్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ తో వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మ‌రో విష‌యం ప‌ట్టించుకోకుండా కేవ‌లం క‌ళ్యాణంపైనే ఫోక‌స్ చేసాడు. ఈ మార్చ్ లోనే పెళ్లి ప‌నులు కూడా మొద‌లైపోయాయి. అయితే ఇదంతా రియ‌ల్ పెళ్లి కోసం కాదు లెండీ..! రీల్ పెళ్లి కోస‌మే. ఈయ‌న న‌టిస్తున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ ఇప్పుడు జ‌రుగుతుంది.

ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి త‌గ్గ‌ట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు స‌తీష్ వేగేశ్న‌. శ్రీ గా రాశీ.. నివాస్ గా నితిన్ న‌టిస్తున్నారు. ఈ శ్రీ‌నివాస్ ల క‌ళ్యాణ‌మే శ్రీ‌నివాస క‌ళ్యాణం. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత స‌తీష్ చేస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. శ‌త‌మానం భ‌వ‌తిని 47 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్తించిన స‌తీష్ వేగేశ్న‌.. ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణంను కూడా ఇదే చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా 50 రోజుల్లోపే పూర్తి చేయాల‌నేది ఈ ద‌ర్శ‌కుడి ప్లాన్.

దీనికి త‌గ్గ‌ట్లే అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. గ‌తేడాది వ‌చ్చిన లైతో పాటు మొన్నొచ్చిన ఛల్ మోహ‌న్ రంగా కూడా డిజాస్ట‌రే. అయితే నితిన్ మాత్రం శ్రీ‌నివాస క‌ళ్యాణంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఒక‌ప్పుడు త‌ను ప్ర‌కాశ్ రాజ్-దిల్ రాజు కాంబినేష‌న్ లో వ‌చ్చిన దిల్ ఎంత‌టి విజ‌యం సాధించిందో.. ఇప్పుడు మ‌ళ్లీ శ్రీ‌నివాస క‌ళ్యాణం అదే మ్యాజిక్ చేస్తుందంటున్నాడు నితిన్. మ‌రి ఈ కుర్ర హీరో న‌మ్మ‌కాన్ని శ్రీ‌నివాస క‌ళ్యాణం ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here