నా నువ్వే ట్రైల‌ర్.. కొత్త‌గా ఉందే..!


నంద‌మూరి హీరోల నుంచి ప్రేమ‌క‌థలు ఊహించ‌డం కాస్త క‌ష్ట‌మే. ఎందుకంటే వాళ్ల చేతుల్లో క‌త్తులు గ‌న్నులు బాగుంటాయి కానీ పువ్వులు కాదు. అందుకే వాళ్లెప్పుడూ అటు వైపు అడుగేయ‌లేదు. చాలా ఏళ్ళ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. సింపుల్ గా క‌ళ్ల‌జోడు పెట్టుకుని ప‌క్కింటి అబ్బాయిగా మారిపోయాడు. నా నువ్వే ట్రైల‌ర్ చూస్తుంటే అస‌లు మ‌నం చూస్తున్న‌ది ఇన్నాళ్లూ చూసిన క‌ళ్యాణ్ రామ్ నేనా అనే డౌట్ కూడా మ‌న‌సులో వ‌చ్చేస్తుంది.
అంత‌గా మారిపోయాడు ఈ చిత్రం కోసం. ల‌వ‌ర్ బాయ్ లా మారిపోయి త‌మ‌న్నాతో రొమాన్స్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక త‌మ‌న్నా కూడా అదిరిపోయింది ఈ చిత్రంలో. పైగా సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకోవ‌డంతో ఇంపాక్ట్ ఇంకా బ‌లంగా ఉంది. ఓవ‌రాల్ గా ట్రైల‌ర్ లో ఆ ప్రెష్ ఫీల్ క‌నిపిస్తుంది. క‌చ్చితంగా కొన్నాళ్లుగా మిస్ అయిందేదో క‌ళ్యాణ్ రామ్ కు ఈ చిత్రంలో క‌నిపించిన‌ట్లుంది.
అందుకే జ‌యేంద్ర క‌థ చెప్ప గానే ఒప్పేసుకున్నాడు. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోకు స‌క్సెస్ ఇప్పుడు కీల‌కం. అది నా నువ్వేతోనే వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి చూడాలిక‌.. ఈ నంద‌మూరి హీరో పువ్వులు ప‌ట్టుకుని ఏం చేస్తాడో..? ఈ చిత్రం మే 25న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here