తాజా వార్తలు ఫీచర్ న్యూస్

నారా రోహిత్-జగపతిబాబు టైటిల్ పాత్రల్లో “ఆటగాళ్లు” ప్రారంభం

Date: October 11, 2017 04:55 pm | Posted By:
స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం “ఆటగాళ్లు”. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారారోహిత్-జగపతిబాబులు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు....

స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం “ఆటగాళ్లు”. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారారోహిత్-జగపతిబాబులు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇంటెలిజంట్ థ్రిల్లర్ కి “గేమ్ విత్ లైఫ్” అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (అక్టోబర్ 11) రామానాయుడు స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

నారా రోహిత్-జగపతిబాబులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శేఖ‌ర్‌క‌మ్ముల క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి.వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. “తొలిసారి జ‌గ‌ప‌తిబాబుగారితో క‌లిసి చేస్తున్నాను. మా ఇద్ద‌రి వాయిస్‌లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి. మా ఇద్ద‌రి గొంతుల‌ను వినాల‌ని ఉంది. విజ‌య్‌.సి.కుమార్‌గారితో నేను చేస్తున్న రెండో చిత్ర‌మిది. సాయికార్తిక్‌తో ఏడో సినిమాకు ప‌నిచేస్తున్నాను. ఇదొక డిఫ‌రెంట్‌, ఎక్స్ పెరిమెంట్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇద్ద‌రు తెలివైన వాళ్ల మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది” అన్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ.. “టైటిల్ చాలా బావుంది. గేమ్ విత్ లైఫ్ అని ఉప‌శీర్షిక పెట్టాం. పెద‌బాబు నుంచి నాకు ముర‌ళి అంటే ఇష్టం. ఆ సినిమాలో పాట‌లు, కామెడీ, సీరియ‌స్‌నెస్ ఉంటుంది. ఇంకా పెద్ద హిట్ కావాల్సింది. దాన్ని మించిన సినిమా తీయ‌మ‌ని ముర‌ళితో చెబుతుంటాను. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాన్ని మించిన సినిమా అవుతుంది. నేను, రోహిత్‌తో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. నేను, రోహిత్ డ‌బ్బింగ్‌లో ఆడుకుంటాం” అన్నారు.

ద‌ర్శ‌కుడు పరుచూరి మురళి మాట్లాడుతూ.. “క‌థ న‌చ్చి ఇద్ద‌రు హీరోలు న‌టించ‌డానికి అంగీక‌రించారు. వారిద్ద‌రి గొంతులు చాలా బావుంటాయి. నారా రోహిత్‌గారు ఇలాంటి క‌థ‌ను ఒప్పుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కొత్త క‌థ‌లు వ‌స్తాయి. చాలా వైవిద్య‌మైన సినిమా ఇది. రెండు షెడ్యూళ్ల‌లో చేస్తాం. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. మంచి కామెడీ కూడా ఉంటుంది. కెమెరామేన్ విజ‌య్ ద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నాను. ఇందులో కామెడీతో పాటు అన్ని అంశాలు పుష్క‌లంగా ఉంటాయి” అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • Shriya’s Sexy Bikini Pose

  Shriya Saran is that rare one senior beauty in Tollywood who can compete with younger lot in glamour show. Shriya’s fitness levels are unbelievable that she can leave behind...
 • Nara Rohith, Pavan Mallela BALAKRISHNUDU Shooting Finished

  Versatile Nara Rohith and debutant director Pavan Mallela’s BALAKRISHNUDU produced by B. Mahendra Babu, Musunuru Vamsi, Sri Vinod Nandamuri of Saraschandrikaa Visionary Motion Pictures, Maya Bazar Movies finished the...
 • నారా రోహిత్ `బాల‌కృష్ణుడు` షూటింగ్ పూర్తి

  స‌ర‌శ్చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `బాల‌కృష్ణుడు`. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా...
 • Samantha To Launch Balakrishnudu Teaser

  Teaser of Nara Rohith starrer ‘Balakrishnudu’ will be unveiled tomorrow. Reportedly, actress Samantha will be launching the teaser at 12.57 PM tomorrow on the auspicious occasion of Vijayadashami. Already released pre-look and...