నక్షత్రం రివ్యూ

MOVIE METER

Average Rating: 2
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మెరవని నక్షత్రం

Rating: 2.25/5

Release Date : 08/04/2017

తారాగణం: సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజినా, ప్రగ్య జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్, జె డి చక్రవర్తి, శివాజీ రాజా, తులసి

దర్శకత్వం: కృష్ణ వంశి

సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర

నిర్మాత: కె శ్రీనివాసులు, ఎస్ వేణుగోపాల్, సజ్జు

కథ:

రామారావు(సందీప్) చిన్నప్పటినుండి పోలీస్ అవ్వాలని కలలు కంటాడు.ఒకానొక సందర్భం లో పోలీస్ కమిషనేర్ కొడుకైన తనీష్ తో గొడవ పడతాడు. ఎస్ ఐ సెలక్షన్ అటెండ్ కాబొత్తున్న తరుణంలో తనీష్ అడ్డు పడటంతో అవకాశాన్ని కోల్పోతాడు రామారావు. బాధ తో చనిపోవాలనుకుంటాడు. అయితే మావయ్య (శివాజీ రాజా) ప్రేరణ మేరకు పోలీసు యూనిఫామ్ ధరించి సొంతగా సమాజం లో జరిగే అరాచకాలమీద శంఖారావం పూరిస్తాడు.

ఈ క్రమంలో ఓ బాంబు దాడిని నిరోధిస్తాడు, దానికి కారకుడిని బంధిస్తాడు. అయితే చట్ట వ్యతిరేకంగా పోలీసు యూనిఫామ్ ధరించినందుకు అరెస్ట్ అవ్వుతాడు. ఈ విషయం పై ఆరా తీయగా రామరావు ధరించిన యూనిఫామ్ తప్పి పోయిన ఐ పి ఎస్ అధికారి అలెగ్జాండర్ (సాయి ధరమ్) యూనిఫామని తెలుస్తుంది. అలెగ్జాండర్ ఎవరు? ఏమయ్యాడు? రామారావు తన నిజాయితీ ఎలా నిరూపించుకుంటాడు, అతని కల ఎలా నెరవేర్చుకుంటాడు అనే విషయాలు నక్షత్రం కధాంశం.

రివ్యూ:

నక్షత్రం కృష్ణ వంశి మార్కు ఫక్తు కమర్షియల్ చిత్రం. కథ పరంగా బాగానే అనిపించినా కధనం లో పటుత్వం లోపించడం వాళ్ళ చిత్రం అంచనాలను అందుకోలేదని చెప్పాలి. ప్రతి పోలీసు ఒక హనుమంతుడి అవతారం అనే పాయింట్ తో కృష్ణ వంశి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. రక్షకభటులు ఖాకి యూనిఫామ్ ధరించి డ్యూటీ చేయడమంటే ఓ పవిత్రమైన దీక్ష చేస్తున్నట్లే అని చెప్పిన తీరు బాగుంది. అయితే ఈ పవర్ఫుల్ పాయింట్ పక్కన పెట్టి కృష్ణ వంశి కమర్షియల్ హంగులు ఎక్కువ శ్రద్ధ పెట్టడం తో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది.

ప్రథమార్ధమంతా రంగురంగుల పాటలలో హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యమిచ్చాడు వంశి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే వర్కౌట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ పూర్తిగా నిరాశపరుస్తుంది. అసలు ఆ పాత్ర ఫేడ్ అవుట్ అయినా ఏ హీరో చేసిన సరిపోయేది. ద్వితీయార్ధం బాగా సాగతీసినట్లుంది చూపించినదే చూపిస్తూ బోరు కొట్టించాడు దర్శకుడు. కధనంలో క్లారిటీ లోపించడం వల్ల చిత్రం అంత గజిబిజి గందరగోళం గా సాగె ఓ అతుకుల బొంతగా తయ్యారయ్యిందా అనిపిస్తుంది. లాజిక్లను గాలికొదిలేశారు వంశి. సందీప్ కిషన్ బాగానే నటించాడు. రెజినా అంగాంగ ప్రదర్శన బాగా చేసింది. ప్రగ్య ఫైట్లు ఇరగదీసింది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది.

ప్లస్:

హీరోయిన్ల గ్లామర్ షో

తారాగణం

మైనస్:

పొంతన లేని కధనం

పాత చింతకాయ పచ్చడి వంటి మేకింగ్

చివరి-మాట: మెరవని నక్షత్రం