దేవుడా.. మెగా కుటుంబం నుంచి ఇంకో హీరో..!

అవును.. స‌ముద్రంలో చేప‌ల‌కు కొద‌వా.. ఇండ‌స్ట్రీలో వార‌సుల‌కు కొద‌వా..? ఒక్క‌రు వ‌స్తే చాలు ఆటోమేటిక్ గా అంద‌రూ వ‌చ్చేస్తారు. ఇప్ప‌టికే మ‌న ఇండ‌స్ట్రీ 80 శాతం వార‌సుల‌తో నిండిపోయింది. ఇప్పుడు ఈ కోవ‌లో మ‌రో హీరో కూడా వ‌స్తున్నాడు. పైగా ఇప్పుడు వార‌సుల‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి ఓ భారీ నిర్మాణ సంస్ధ‌ కూడా రెడీ అయ్యాడు.

VAISHNAV TEJ

వాళ్లే మైత్రి మూవీ మేక‌ర్స్. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ సంస్థ ఇప్పుడు మెగా మేన‌ల్లుడిని ప‌రిచ‌యం చేసే కార్య‌క్ర‌మం పెట్టుకుంది. కొత్త ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రానికి సుకుమార్ క‌థ అందించ‌డం విశేషం. ఆయ‌న సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగ‌మే. ఇప్ప‌టికే మెగా మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ముందుకెళ్తున్నాడు.

ఈ మ‌ధ్య కొన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా సాయికి ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఇదే దారిలో అత‌డి త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా వ‌స్తున్నాడు. ఈయ‌న్ని హీరోను ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ను సుకుమార్ తీసుకోవ‌డంతో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం ఈయ‌న న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. పైగా వైష్ణ‌వ్ వెన‌క ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ముందు నుంచి సాయికి కూడా ఈయ‌నే బ్యాక్ స‌పోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు అత‌డి త‌మ్ముడికి కూడా ప‌వ‌ర్ స్టార్ వెన‌కుంటున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఓ అల్లుడు గిల్లుడు బాగానే ఉంది.. మ‌రి ఇప్పుడు ఈ కొత్త‌ల్లుడు ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here