Telugu తాజా వార్తలు ఫీచర్ న్యూస్

దీపికా నుండి పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా ఎవ్వరు నటించనన్నారట ఆయన సరసన

Date: October 12, 2017 12:46 pm | Posted By:
రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ షూటింగ్ మొదలవక్కముందే వివాదాలు వెంటాడుతున్నాయి. తాజా గా టీడీపీ మంత్రి సోమిరెడ్డి ఆర్ జి వి ని లక్ష్మి పార్వతి నే హీరోయిన్ గా పెట్టి సినిమా తీసుకోమని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఓ...

రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ షూటింగ్ మొదలవక్కముందే వివాదాలు వెంటాడుతున్నాయి. తాజా గా టీడీపీ మంత్రి సోమిరెడ్డి ఆర్ జి వి ని లక్ష్మి పార్వతి నే హీరోయిన్ గా పెట్టి సినిమా తీసుకోమని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఓ న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ సోమి రెడ్డి వర్మ తనను హీరో గా చేయమన్న అభ్యంతరం లేకుండా నటిస్తానని అయితే హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గాక ఇంకెవరినైనా తీసుకోమని చెప్పగా. వర్మ తన పేస్ బుక్ లో మంత్రి గారికి కౌంటర్లు ఇలా ఇచ్చాడు. మీరే చదవండి

My replies to the great honourable TDP agriculture minister మర్యాద తిమ్మన్న సోమిరెడ్డి గారి comments
మినిస్టర్ సోమి :
NTR జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరో గా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం
నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి
RGV:
సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పాడుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా
మినిస్టర్ సోమి :
లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా..
RGV:
అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ, హీరోయిన్లపై మీ ఈ insulting కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లు మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి&@“?:(@@వాళ్ళు ..నేను దీని అర్థం చెప్పను. ఎందుకులే ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!!!
మినిస్టర్ సోమి :
ఎన్ టి ఆర్ గురించి నాకు తెలిసినంతగా రాంగోపాల్ వర్మకు తెలియదు
RGV:
మై డియర్ సోమి ,ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని ?
మినిస్టర్ సోమి :
రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారు
RGV:
సోమి ,రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా …..ఆలా అయితే nee N కి నా నమస్కారం. N ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ..N అంటే nee నోరు
మినిస్టర్ సోమి: political reasons కోసమే ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాతగా వున్నారు
RGV: ఛా! మా నాయనే… నీ ఇల్లు బంగారం గాను… చిన్నప్పటి నుండి ఇన్ని తెలివితేటలా సార్.. 😘😘😘 వావ్😍😍😍
మినిస్టర్ సోమి :
ఎన్ టి ఆర్ చరిత్రను వక్రీకరించి కేవలం లక్ష్మీ పార్వతి కోణంలోనే సినిమా తీస్తే ప్రజలు ఒప్పుకోరు..
RGV:
ఓహ్ సార్ ఈ మాట కోట్ల ప్రజలు ట్రైన్లలో, బస్సుల్లో మీ ఇంటికొచ్చి మీ చెవిలో చెప్పారా సార్ ..Soooo wonderfulll😍😍Want to sooooo kiss u 😘😘😘
మినిస్టర్ సోమి :
రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా గురించి మేము భయపడటం లేదు
RGV: భయపడనప్పుడు ఇంత అరవాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు ? Just asking? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఉందంటారా సార్ ?
మినిస్టర్ సోమి :
రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాస్తవమ్ తీయమని అంటున్నా…
RGV: అబ్బబ్బో మీకు నాకన్నా ఎక్కువ వాస్తవాలు తెలుసని మీరు అంటుంటే ఆ రోజుల్లో తలుపెనక నక్కి ఉండేవారా లేక మంచం కింద దాక్కునేవారా? …రెడ్డిగారు చెప్పండి ప్లీజ్ ..మేము మీ గాసిప్ కోసం తహతహలాడిపోతున్నాము.
చివరగా నాకన్నా ఎక్కువ NTR గారి గురించి తెలుసన్న సోమిరెడ్డి గారికి నా open challenge ఏమిటంటే TV9 లో Open Debate కి రమ్మని ..సోమిరెడ్డి గారు మీరు ఫ్రీ ఉన్నపుడు ముంబైలో నా అన్ని పనులు మానుకొని debate కి వస్తా ..టైము ప్లేసు మీరే చెప్పండి సార్

Categories
Teluguతాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • Ram Gopal Varma Supports CM

  Lakshmi’s NTR is creating stir in political circles. One after the other TDP leaders have been attacking Ram Gopal Varma for announcing the controversial film. TDP leaders Babu Rajendra...
 • ఎన్టీఆర్ కలలోకి వస్తున్నారు, ఆయనే నాకు స్ఫూర్తి అంటున్న ‘సైకో’!

    రామ్ గోపాల్ వర్మ ఓ సైకో అట, డబ్బు కోసం కులాల మధ్య చిచ్చు పెట్టె రకం అని తాజాగా విమర్శించారు అనంతపూర్ టీడీపీ ఎం.ఎల్.ఏ ప్రభాకర్ చౌదరి. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించనప్పటినుండి వర్మ ఇటువంటి అనేక విమర్శలు,...
 • RGV Reveals Lead Actors In Lakshmi’s NTR

  Ram Gopal Varma is all over headlines for announcing Lakshmi’s NTR. The sensational director created stir in political circles saying that he’s going to focus on NTR’s life after...
 • ఎన్టీఆర్ భార్యగా రోజా నటిస్తుందా?

  రామ్ గోపాల్ వర్మ లక్ష్మి’స్ ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించేసారట. వై.ఎస్.ఆర్.సి.పి. నేత రాకేష్ రెడ్డి ఈ బయోపిక్ ను నిర్మించనున్నారని ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్.జి.వి పలమనేరులో రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మీడియా తో...