దర్శకుడు రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 2

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

దర్శకుడు ప్రేమికుడయితే

Rating: 2.5/5

www.teluguodu.com

దర్శకుడు – జస్ట్ ఓకే అంతే

Rating: 2.75/5

www.123telugu.com

Release Date : 08/04/2017

తారాగణం: అశోక్ బండ్రెడ్డి, ఈషా రెబ్బ

దర్శకత్వం: జక్కా హరిప్రసాద్

సంగీతం: సాయి కార్తీక్

నిర్మాత: సుకుమార్

కథ :

మహేష్(అశోక్) దర్శకుడవ్వాలని కలలు కంటుంటాడు. అతనికి ఓ నిర్మాత ఛాన్స్ ఇవ్వగా ఓ లవ్ స్టోరీ ని తెరకెక్కించడానికి సిద్ధమవుతాడు. షూటింగ్ ప్రారంభం అయ్యాక మహేష్ నిజజీవితం లో నమ్రత అనే కాస్ట్యూమ్ డిజైనర్ తో ప్రేమలో పడతాడు. ప్రేమ వ్యవహారం వల్ల చాల చిక్కులో పడతాడు. మహేష్ చిత్రాన్ని పూర్తి చేయగలడా? అతను నమ్రతను ఒప్పించి పెళ్లి చేసుకోగలడా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే దర్శకుడు చిత్రాన్ని వెండి తెర పై చూడండి.

రివ్యూ:

కుమారి 21F తర్వాత సుకుమార్ నిర్మించిన చిత్రం కావడంతో దర్శకుడు పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓ దర్శకుడు కాస్ట్యూమ్ డిజైనర్ను ప్రేమించడం అనే కధాంశం కొత్తగానే ఉన్న కధనంలో పోరాబాట్లు దొర్లాయి. ప్రథమార్ధం హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించే నేపథ్యంతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సుకుమార్ తరహాలో చిత్రంగా ఉంటుంది. ద్వితీయార్ధం నిరాశ పరుస్తుంది. సుకుమార్ మార్కు కనపడదు, చాల నెమ్మదిగా సాగి ప్రేక్షకులకు విసుగనిపిస్తుంది.

కుమారి 21F లాగా బోల్డ్ కంటెంట్ గాని మనసుకు హత్తుకునే సన్నివేశాలు గాని ఈ చిత్రంలో లేక పోవడం మరో మైనస్. సాయి కార్తీక్ సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నిర్మాణ విలువలు పెద్దగ కనపడవు. ఓ షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అశోక్ బాగానే చేసినా, ఓ ఎస్టాబ్లిషయ్యిన హీరో చేసి ఉంటె చిత్రానికి బాగా ప్లస్ అయ్యేదేమో అనిపిస్తుంది. ఈషా అందం కనిపిస్తూనే మంచి అభినయాన్ని ప్రదర్శించింది. కామెడీ కి స్కోప్ ఉన్న దర్శకుడు ఎందుకో పెద్దగ పట్టించుకోలేదు. సుదర్శన్ మరియు ప్రియదర్శి అడపా తడప నవ్వులు పూయిస్తారు.

ప్లస్:

ఐడియా బాగుంది

నిడివి

మైనస్:

కొత్తదనం లేకపోవడం

నిర్మాణ విలువలు లోపించడం

చివరి మాట: దర్శకుడు ప్రేమికుడయితే