Uncategorized తాజా వార్తలు ఫీచర్ న్యూస్

థియేటర్‌పై దాడి చేసిన మెగా అభిమానులు…

Date: January 11, 2017 10:48 am | Posted By:
నిన్న గుంటూరు జిల్లా కొల్లూరులో ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా ఉద్రిక్తత జరిగింది. నిన్న అర్ధ రాత్రి నుంచి సినిమా విడుదల కోసం శ్రీనివాస థియేటర్‌ దగ్గర అభిమానులు ఎదురుచూసారు. థియేటర్ యాజమాన్యం ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేస్తామని...

khaidi-no-1504

నిన్న గుంటూరు జిల్లా కొల్లూరులో ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా ఉద్రిక్తత జరిగింది. నిన్న అర్ధ రాత్రి నుంచి సినిమా విడుదల కోసం శ్రీనివాస థియేటర్‌ దగ్గర అభిమానులు ఎదురుచూసారు. థియేటర్ యాజమాన్యం ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేస్తామని చెప్పి తెల్లవారే వరకు వేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభిమానులు థియేటర్ తెరను చించి కుర్చీలు విరగొట్టి నానా హంగామా సృష్టించారు. దీంతో అవాక్కయిన థియేటర్ యాజమాన్యం పోలీసులను రంగంలోకి దించి అభిమానులను చెదరగొట్టారు. రాత్రంతా ఖైదీ నెం.150 సినిమా చూడాలని ఎదురుచూసిన అభిమానులకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలా జరిగిందని అభిమానులు ఆరోపించారు.

Categories
Uncategorizedతాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY