జ‌రిగింది చెప్తాం.. జ‌ర‌గ‌బోయేది చెప్తామంటున్న ప్ర‌భాస్

అదేంటి.. అలా చెప్పేది కోయ‌దొర‌లు క‌దా..? ఇదే ప‌దాన్ని కాస్త స్టైలిష్ గా చెప్పాలంటే జాత‌కాలు చెప్ప‌డం అంటారు. ఇంగ్లీష్ పామిస్ట్ అంటారు క‌దా.. ఇప్పుడు ఇదే పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు సాహోతో బిజీగా ఉన్నాడు. ఇది సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమా అక్టోబ‌ర్ చివ‌ర్లో ప‌ట్టాలెక్క‌నుంది. క‌థ అంతా యూర‌ప్ చుట్టూనే తిర‌నుంది. అక్క‌డే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాధా. అయితే నెల‌ల త‌ర‌బ‌డి అక్క‌డే షూటింగ్ చేయాల్సి రావ‌డంతో మ‌నం అక్క‌డికి వెళ్లేకంటే.. ఆ దేశాన్నే ఇక్క‌డికి తీసుకొస్తే బాగుంటుంది క‌దా అని ఆలోచిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్.

prabhas

ఈ ప్లానింగ్ అంతా సాహో కోసం మాత్రం కాదు. ఆ త‌ర్వాత సినిమా కోసం. జిల్ ఫేమ్ రాదాకృష్ణ‌తో సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఓకే చెప్పాడు. ఈ చిత్ర ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం వేగంగా జ‌రుగుతుంది. సాహో సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ సినిమాను కూడా పూర్తి చేయాల‌నేది ఈయ‌న ప్లాన్.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2019లో రెండు సినిమాలతో రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌భాస్. రాధాకృష్ణ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. అక్క‌డే దాదాపు 70 శాతం షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే మేజ‌ర్ పార్ట్ అంతా యూర‌ప్ లోనే షూట్ చేసి.. ప్యాచ్ వ‌ర్కుల కోసం మాత్రం ఇక్క‌డే ఓ సెట్ వేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌తీ చిన్న విష‌యానికి యూర‌ప్ అంటే కుద‌ర‌దు.

అందుకే ఆ దేశ‌పు సెట్ ను హైద‌రాబాద్ లో వేయాల‌ని చూస్తున్నారు. యూర‌ప్ ను త‌ల‌పించేలా భారీ సెట్టింగులు.. రోడ్లు.. క‌ట్ట‌డాలు ఇక్క‌డే వేయ‌బోతున్నారు. 6 కోట్ల‌కు పైగా భారీ ఖ‌ర్చుతో ఈ సెట్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. దీనికోసం హాలీవుడ్ నిపుణులు కూడా ప‌ని చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ జాత‌కాలు చెప్పేవాడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. 70-80వ ద‌శ‌కంలో ఈ క‌థ న‌డ‌వ‌నుంది. మొత్తానికి చూడాలిక‌.. ప్ర‌భాస్ జాత‌కం ఈ సినిమాతో ఎలా మార‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here