జై లవ కుశ రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 2

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మాస్ చిత్రాల్లో కొత్త ఒరవడి

Rating: 3.5/5

www.teluguodu.com

అభిమానులు మెచ్చే చిత్రం
Rating: 3.25/5

www.123telugu.com

Release Date : 09/21/2017

తారాగణం: ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, రోనిత్ రాయ్, పోసాని కృష్ణ మురళి, సాయి కుమార్, ప్రవీణ్

దర్శకత్వం: కే.ఎస్. రవీంద్ర (బాబీ)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్

బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్

కథ:

జై, లవ, కుశ కవలలు అయినా ఈ ముగ్గురు అన్నదమ్ములు చిన్నతనంనుండి రామాయణ మహాభారత నాటకాలు వేస్తుంటారు. వారి మేనమామ(పోసాని) లవ, కుశ లను బాగా చూసుకుంటాడు గాని జై ని మాత్రం చులకనగా చూస్తాడు. నత్థి ఉందని ఎప్పుడు వెక్కిరిస్తావుంటారు అందరూ, దీనితో జై తమ్ములని సమాజాన్ని ద్వేషించడం మొదలుపెడతాడు. రావణుడిని ఆదర్శంగా తీసుకొని అతని లా అవ్వాలనుకుంటాడు. అని కొని ఓ సంఘటన తో ముగ్గురు విడిపోతారు. లవ ఓ మంచి కుటుంబంలో పెరిగి బ్యాంకు మేనేజర్ అవుతాడు. కుశ దొంగగా మారతాడు.

జై మాత్రం వేరే రాష్ట్రంలో ఓ దాదాగా వెలుగుతుంటాడు. లవ ప్రియా (రాశి) తో ప్రేమలో పడతాడు. ఒక రోజు అతని మీద బ్యాంకు లో సమస్య ఎదురవుతుంది. కుశ లవ రూపంలో బ్యాంకు మేనేజర్ గా వెళతాడు, అన్న సమస్య తీరుస్తానని చెప్తాడు. కానీ బ్యాంక్లో కోట్ల డబ్బు పట్టుకుని పరారవుతాడు. వీరిద్దరికి అనుకోని ఎదురుదెబ్బ తగులుతుంది. డబ్బు, ప్రియా ఇద్దరు ఒకే సరి మాయమవుతారు. అపహరించింది ఎవరో కాదు చిన్నతనంలో తప్పి పోయిన అన్న జై అని తెలుసుకుంటారు. జై రాజకీయం గా ఎదగడానికి లవ-కుశ లను సహాయం చేయమని కోరతాడు లేకుంటే ప్రియని చంపేస్తానని బెదిరిస్తాడు. వీరి ముగ్గురు మధ్య తర్వాత జరిగే ఆసక్తి కార విషయాలను తెరపై చూడాల్సిందే.

కథనం:

జై లవ కుశ కథ చాల సార్లు చూసిన అన్నదమ్ములు విడిపోయి కలిసే కథే అయినా, ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకనుగుణంగా కొత్తగా చిత్రీకరించబడిన చిత్రం. పైపెచ్చు ఎన్టీఆర్ అద్భుత నటన ఈ చిత్రానికి మరో స్థాయిలో నిలబెడుతుంది. దర్శకుడు బాబీ ప్రేక్షకులను కట్టిపడేసేలా కథనాన్ని కొత్త పంధాలో పరుగులు పెట్టించాడు. ప్రథమార్ధం కుశ కామెడీ తో సరదాగా సాగిపోతుంది.

లవ లవ్ ఎపిసోడ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు సిసలు ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది ‘జై’ రూపంలో. ద్వితీయార్థం మొత్తం జై క్యారెక్టర్ డామినెటే చేస్తుంది. జై కి విల్లన్ లతో గొడవలు, రాజకీయాలు చూపడం తో ఎంటర్టైన్మెంట్ కొరవడుతోంది. క్లైమాక్స్ లో హెవీ సెంటిమెంట్ మరియు ఫైటింగ్లు ఉంటాయి.

తారాబలం

నిస్సందేహంగా జై లవ కుశ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్ ఆక్రమిస్తాడు. యంగ్ టైగర్ తన నట విశ్వరూపం తో ప్రేక్షకులను సంబరమాశ్చర్యాలలో ముంచి తెలుస్తాడు. మూడు భిన్న వ్యక్తిత్వాలు గల పాత్రల్లో ఎన్టీఆర్ హావభావాలు అబ్బుర పరుస్తాయి. ఒకే ఫ్రేమ్ లో జై లవ కుశ గా ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, టైమింగ్ అద్భుతం అనిపిస్తాది.

రాశి ఖన్నా, నివేత హీరోయిన్ లు గా బాగానేచేసారు అయితే వారివి నటనకు పెద్దగా అవకాశం లేని పత్రాలు. తమన్నా ‘స్వింగ్ జర’ అంటూ మితి మీరిని ఎక్సపోసింగ్ చేసిన ఐటెం పాట అంతగా ఆకట్టుకోలేక పోయింది కారణం డాన్స్ అంత గొప్పగా కొరియోగ్రాఫ్ చేయకపోవడం పైగా ఎన్టీఆర్ రెండు మూడు స్టెప్పులేయడం. పోసాని, సాయి కుమార్ కు మంచి పాత్రలు ఉన్నాయి. విల్లన్ గా రోనిత్ రాయ్ తెలుగు నేటివిటీ కి నప్ప లేదు.

సాంకేతికత:

దేవి శ్రీ ప్రసాద్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు, ఎన్టీఆర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అదనపు హంగును అందించింది. నీకళ్ళలోన సాంగ్ తెరపై ఇంకా బాగుంది. కెమెరా అంగ్లెస్ హీరో ఎలేవేషన్ బాగా చేసాయి. డైలాగులు చాల బాగా రాసారు. “ఇది బ్యాంకా బ్యాన్గకాక్క?” అని చమత్కారమైన, క్లైమాక్స్ లో రైతులపై వచ్ఛే డైలాగు హత్తుకుంటుంది. ఆర్ట్ డిజైనింగ్ కూడా చాల భారీగా ఉంటుంది.
స్క్రీన్ప్లే లోపాలు ఉన్న ఎన్టీఆర్ నటన తో అవి అంతగా హైలైట్ కావు. నివేత థామస్ ప్రతిభకు సరిపడే పాత్ర కాదు ఆమెది. ద్వితీయార్ధం సెంటిమెంట్ పళ్ళు కాస్త ఎక్కువయ్యి ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది.

మొత్తం మీద జై లవ కుశ కమర్షియల్ చిత్రమే అయినా, మాస్ చిత్రాల్లో కొత్త ఒరవడిని ప్రవేశ పెడుతుంది. సృజనాత్మకత, కళాత్మకత కలిగిన చిత్రము గా కూడా నిలుస్తుంది.