తాజా వార్తలు ఫీచర్ న్యూస్

జై లవ కుశ ఫస్ట్ లుక్ పోస్టర్

Date: May 19, 2017 03:26 pm | Posted By:
‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మీసం తిప్పిన మొహంతో ఎన్టీఆర్ పవర్ఫుల్ పోజ్ చూసి అభిమానులు ఆనంద పడుతున్నారు. ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ బంధించబడినట్టుగా కనిపిస్తున్నాడు. బాక్గ్రౌండ్ లో ఉన్న ‘రావణ’ ఇమేజ్...

‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మీసం తిప్పిన మొహంతో ఎన్టీఆర్ పవర్ఫుల్ పోజ్ చూసి అభిమానులు ఆనంద పడుతున్నారు. ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ బంధించబడినట్టుగా కనిపిస్తున్నాడు. బాక్గ్రౌండ్ లో ఉన్న ‘రావణ’ ఇమేజ్ ఈ సినిమాకు దసరాతో ఏదో సంబంధం ఉందని సూచిస్తోంది. ఎన్టీఆర్ కు విజయ దశమితో సెంటిమెంట్ ఉంది. అతని బ్లాక్బస్టర్ ఫిలిం ‘ఆది’ కూడా అదే రోజు విడుదలయింది. మరోవైపు, ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ తన ప్లాప్ మూవీ ‘దమ్ము’ కన్నా బిన్నంగా ఏం లేదని విమర్శ కూడా ఉంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రాశి ఖన్నా అండ్ నివేత థామస్ ముఖ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY