తాజా వార్తలు ఫీచర్ న్యూస్

జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా నాని, దానయ్య డి.వి.వి. చిత్రం ‘నిన్ను కోరి’

Date: April 21, 2017 02:59 pm | Posted By:
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం...
ninnu-kori2
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత దానయ్య డి.వి.వి. తెలియజేస్తూ – ”అమెరికాలో భారీ షెడ్యూల్‌ చేశాం. ఏప్రిల్‌ 17 నుంచి వైజాగ్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం” అన్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.
Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • ఫుల్ బిజీగా ఉన్న ఆది పినిశెట్టి

  ఆది పినిశెట్టి నటించిన సినిమా మరకతమణి గత వారం విడుదల అయ్యి పరవాలేదనిపించుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా తాను ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలో తాను...
 • నాని సినిమా రీమేకా ?

  నాని నటించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నిన్ను కోరి సినిమా ట్రైలర్ గత వారం విడుదల అయిన విషయం తెలిసిందే. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ సినిమా ట్రైలర్ ను తెగ మెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా...
 • Nivetha Thomas At Jio Film Fare Awards

  ...
 • Is Ninnu Kori A Remake Of Salman Khan Film?

    Trailer of Nani’s upcoming film ‘Ninnu Kori’ is creating ripples on social media. The trailer received rave response from film buffs. Even Baahubali director SS Rajamouli appreciated the...