జయ జానకి నాయక రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

సెంటిమెంట్ కలిసిన మాస్ చిత్రం

Rating: 3/5

www.teluguodu.com

Release Date : 08/11/2017

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, శరత్ కుమార్, జగపతి బాబు, జయకుమార్, నందు, వాణి విశ్వనాధ్, తరుణ్ అరోరా

దర్శకత్వం: బోయపాటి శ్రీను

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి

బ్యానర్: ద్వారకా క్రియేషన్స్

కథ:

గగన్ (బెల్లంకొండ) ఉడుకు రక్తమున్న స్టూడెంట్, ఎవరికైనా కష్టమొస్తే ఎంతకైనా తెగిస్తాడు. అన్న (నందు) మరియు తండ్రి (శరత్ కుమార్) కూడా గగన్ కు ఏ మాత్రం తీసిపోరు. పారిశ్రామికవేత్తే అయినా కొడుకుల తో సరదాగా పార్టీలు చేసుకుంటూ అల్లరి చిల్లరి గా తిరుగుతుంటాడు శరత్ కుమార్. తల్లి చిన్న తనం లోనే చనిపోవడంతో ముగ్గురు క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతుంటారు. అలంటి వారి జీవితంలో ఆనందాల వెలుగులు తెస్తుంది జానకి (రకుల్). గగన్ జానకితో ప్రేమలో పడతాడు.

కానీ ఆమె తండ్రి ఓ ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో రౌడీలు వాలే బ్రతికే వారింటికి తన కూతురిని ఇవ్వనంటాడు. మనసు విరిగిన గగన్ వైజాగ్ వెళ్ళిపోతాడు. ఈ లోపల జానకి తండ్రి ఓ కాంట్రాక్టు విషయమై ఇద్దరు పారిశ్రామికవేత్తలతో గొడవ పడతాడు. వారి వల్ల జానకి ఇరకాటంలో పడుతుంది. జానకి ఎలాంటి ఇబ్బందులెదురుకుంటుంది? గగన్ విలన్స్ తో తలపడి జానకి ని ఎలా కాపాడుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే జయ జానకి నాయక చిత్రం వెండి తెర పై చూడాలిసిందే.

రివ్యూ:

జయ జానకి నాయక బోయపాటి శ్రీను మార్కు పక్క మాస్ చిత్రం. కథ కధనం లో సర్రైనోడు చాయలు కనిపిస్తాయి. కథ రకుల్ పాత్రా చుట్టూ తిరుగుతుంది. భద్ర, తులసి, సర్రైనోడు చిత్రాలలో లగే హీరోయిన్ కి విలన్స్ వల్ల ముప్పు ఉంటుంది, ఆమెకు అండగా నిలిచి విలన్స్ ఢీ కొట్టే పాత్ర హేరోది. జయ జానకి నాయక లో ఇద్దరు విల్లైన్లు ఉంటారు. ప్రథమార్ధం సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్ధం ఎమోషన్ మరియు సెంటిమెంట్ సీన్స్ తో భారీగా అనిపిస్తుంది. చిత్రం నిడివి ఎక్కువైనట్లనిపిస్తుంది.

కధనం లో మలుపులు కరువై నందుకు బోయపాటి కొత్త కొత్త పాత్రలను పరిచయం చేస్తూ వచ్చాడు. ప్రగ్య జైస్వాల్, వాణి విశ్వనాధ్ పాత్రలు అవసరం లేక పోయిన పెట్టినట్లనిపిస్తాయి. విల్లన్స్ హీరోయిన్ కుటుంబాన్ని ఎటాక్ చేయడం, హీరో వచ్చి కాపాడటం ఇదే ఎపిసోడ్ మళ్ళి మళ్ళి రిపీట్ చేసాడు బోయపాటి. డజన్ల కొద్ది గూండాలని ఒంటి చేత్తో మత్తు పెడుతుంటాడు హీరో. చూడటానికి వస్తాదు లనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎక్స్ప్రెషన్ డైలాగ్ డెలివరీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. డ్యాన్సులు బాగానే చేసాడు.

రకుల్ ఫస్ట్ హాఫ్ లో బబ్లీగా సెకండ్ హాఫ్ లో బరువైన పాత్రని బ్యాలన్సుడ్ గా బాగా చేసింది. ఫ్రెండ్లీ తండ్రిగా శరత్ కుమార్ పాత్ర చాల బాగుంటుంది. జగపతి బాబు ఇంట్రడక్షన్ బాగుంటుంది కానీ పోను పోను రొటీన్ అనిపిస్తుంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి వన్నె తెచ్చింది. పాటలు ఆడియన్స్ కు ఊపు నిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఛాయాగ్రహం కూడా హై క్వాలిటీ కనపడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, జయ జానకి నాయక మాస్ మసాలా చిత్రాలను ప్రేమించే సదరు తెలుగు ప్రెకషకుడిని తప్పక అలరిస్తుంది.

ప్లస్

రకుల్ & బెల్లంకొండ రొమాంటిక్ కెమిస్ట్రీ

నటి నటులు, వారి పెర్ఫార్మన్స్

క్వాలిటీ మేకింగ్

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

మైనస్:

రొటీన్ కధ, కధనం

నిడివి ఎక్కువవడం

చివరి మాట: సెంటిమెంట్ కలిసిన మాస్ చిత్రం