‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ తొలి కాపీ సిద్ధం

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం. ఈ చిత్రం తొలి కాపీ రెడీ చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజంట్‌ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్‌ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాము.  చిత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం తొలి కాపీ రెడీ అయ్యింది. ఈ వీక్ లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ నెలాఖరుకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాము…” అని అన్నారు.
శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి కెమెరా: రత్నబాబు, సంగీతం: గోపీ, ఎడిటింగ్‌: నరసింహారెడ్డి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్, నిర్మాతలు: కార్తీక్‌రెడ్డి, అశోక్ సిరియాల; దర్శకత్వం: కృష్ణవర్మ.
Banner: KEERTHI CEATIONS

Movie:  JANDHYALA RASINA PREMA KADHA
Director:  KRISHNA VARMA
Producers:  KARTHIK REDDY, ASHOK SIRIYALA
Executive producer: VENKAT
Artists:  SHEKAR, ROHITH, SRI LAXMI, GAYATRI GUPTHA
Music: GOPI
Camera:  RATNA BABU
Editor:  NARASIMHA REDDY