తాజా వార్తలు

చివరికి దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న యంగ్ హీరో

Date: February 15, 2017 04:42 pm | Posted By:
దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన శతమానం భవతిలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించాల్సింది. కానీ ఈ యాక్టర్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో అందులో నటించలేదు. తాజా వార్తల ప్రకారం, చివరికి రాజ్ తరుణ్...

Dilraju about a aa success

దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన శతమానం భవతిలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించాల్సింది. కానీ ఈ యాక్టర్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో అందులో నటించలేదు. తాజా వార్తల ప్రకారం, చివరికి రాజ్ తరుణ్ దిల్ రాజు నిర్మాణంలో పనిచేయడానికి సిద్ధమయ్యాడు.

ఒక పాపులర్ మీడియా హౌస్ ప్రచురించిన తాజా వార్తల ప్రకారం, రాజ్ తరుణ్ రాబోయే సినిమా కోసం ఆలా ఎలా ఫేమ్ డైరెక్టర్ అనీష్ కృష్ణని దిల్ రాజు ఎంపిక చేసాడని తెలుస్తోంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మరియు కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా వేసవి కాలంలో సెట్స్ పైకి వెళ్లనుంది మరియు ప్రధానంగా ఈ సినిమా షూటింగ్ కేరళలో జరగనుంది.

అనీష్ కృష్ణ అల్లరి నరేష్ మెయిన్ లీడ్ గా మలయాళం హిట్, ఓరు వాడక్కన్ సెల్ఫీ తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయాల్సింది. అయితే, ప్రకటించి చాలా నెలలు అయినప్పటికీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

Categories
తాజా వార్తలు

RELATED BY