తాజా వార్తలు ఫీచర్ న్యూస్

చిరంజీవితో రొమాన్స్ చేయనున్న మరో పవన్ – చరణ్ హీరోయిన్..?

Date: February 16, 2017 12:04 pm | Posted By:
‘ఖైదీ నెం.150’ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా స్టార్ చిరంజీవి తన 151వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఫిలిం నగర్ బజ్ ప్రకారం, మేకర్స్ ఈ సినిమా హీరోయిన్...

shruti-haasan

‘ఖైదీ నెం.150’ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా స్టార్ చిరంజీవి తన 151వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఫిలిం నగర్ బజ్ ప్రకారం, మేకర్స్ ఈ సినిమా హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నారు. ఖైదీ నెం.150 హీరోయిన్ సెలక్షన్ కోసం చాలా సమయం పట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి వాళ్ళు ఆ పరిస్థితి రాకూడదని భావిస్తున్నారు.

అనుష్కని సంప్రదించారు కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసి పెళ్లి కోసం సిద్ధమవుతోందని నమ్ముతున్నారు. తాజా సమాచారం ప్రకారం, శృతి హాసన్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. శృతి హాసన్ రామ్ చరణ్ తో ఎవడులో నటించింది మరియు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడులో బిజీగా ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ ముప్పై ఏళ్ళ బ్యూటీ మెగా స్టార్ తో తన తర్వాత సినిమాలో రొమాన్స్ చేయొచ్చు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY