తాజా వార్తలు ఫీచర్ న్యూస్

చలపతి రావు మళ్ళీ తప్పు మాట్లాడాడు…

Date: July 17, 2017 02:56 pm | Posted By:
సీనియర్ నటుడు చలపతి రావు రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో ఆడవారు పక్కలోకి పనికొస్తారన్న వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆయన చేసిన తప్పుకు క్షమాపణలడగగా ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా చలపతి రావు...
సీనియర్ నటుడు చలపతి రావు రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో ఆడవారు పక్కలోకి పనికొస్తారన్న వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆయన చేసిన తప్పుకు క్షమాపణలడగగా ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా చలపతి రావు మళ్ళీ ఆడవారి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ చీరకట్టుకున్న స్త్రీలను కూడా ఆకతాయిలు కామెంట్ చేస్తున్నారు దీని మీద మీ స్పందన తెలపమని అడగగా చలపతి రావు ఇది వాక్ స్వేచ్ఛ ఉన్న దేశం కనుక ఎవరయినా ఏమైనా కామెంట్ చేయొచ్చని, అవి పట్టించుకోకుండా ఆడవాళ్లే తలదించుకు వెళ్లిపోవడం ఉత్తమమని సెలవిచ్చారు.
అంతటి తో ఆగకుండా, ఆడవాళ్ళకు కౌమారదశ వచ్చినప్పుడు పైట ఎందుకువేస్తారో విడమరిచి సైగలు చేస్తూమరీ చెప్పి లేడీ యాంకర్ కూడా సిగ్గుపడేలాచేసాడు చలపాయ్!
Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY