తాజా వార్తలు ఫీచర్ న్యూస్

చట్టపరమైన సమస్యల్లో క్రిష్ బాలీవుడ్ మూవీ

Date: May 19, 2017 05:10 pm | Posted By:
రెండు వారాల క్రితం, డైరెక్టర్ క్రిష్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ రాణి లష్మిబాయి వీరోచిత వారసత్వం ఆధారంగా ప్రతిష్టాత్మక చారిత్రక బయోపిక్ గా మణికర్ణిక అనే టైటిల్ తో తన కొత్త బాలీవుడ్ ఫిలిం లాంచ్ చేసాడు. బాలీవుడ్ యాక్ట్రెస్...

రెండు వారాల క్రితం, డైరెక్టర్ క్రిష్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ రాణి లష్మిబాయి వీరోచిత వారసత్వం ఆధారంగా ప్రతిష్టాత్మక చారిత్రక బయోపిక్ గా మణికర్ణిక అనే టైటిల్ తో తన కొత్త బాలీవుడ్ ఫిలిం లాంచ్ చేసాడు. బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

కానీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే చట్టపరమైన చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.
సీనియర్ బాలీవుడ్ డైరెక్టర్ కేతన్ మెహతా తన నుంచి రాణి లక్ష్మీబాయి బయోపిక్ ని కంగనా రనౌత్ కొట్టేసిందని ఆరోపిస్తూ లీగల్ నోటీసు పంపినట్టు తెలుస్తోంది.

ముందు, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని కేతన్ మెహతా డైరెక్ట్ చేయాల్సింది. ఆ తర్వాత రెండేళ్లకు పైగా తాను ఈ స్క్రిప్ట్ పై పరిశోధన చేసిన తర్వాత కంగనా రనౌత్ ఈ సినిమాను కో-రైట్ అండ్ కో-డైరెక్ట్ చేయాలని అనుకుంటుండడంతో డైరెక్ట్ చేయడం నుంచి తనను తప్పించారని ఆరోపించాడు.

కేతన్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా విడుదల చేసాడు. “కంగనా రనౌత్ డాక్యుమెంట్స్ మరియు తనతో షేర్ చేసిన స్క్రిప్ట్ తో పాటు పరిశోధన పదార్థాలను రహస్యంగా ఉంచిందని తెలిసి కూడా ప్రొడ్యూసర్ కమల్ జైన్ మరియు ఇతరులు కుట్ర పన్ని ప్రాజెక్ట్ ని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని” తెలిపాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY