ఘాజీ రివ్యూ

MOVIE METER

Average Rating: 4
Total Critics: 3

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మరుగుపడిన చరిత్రను కళ్ళకు కట్టే ప్రయత్నం

Rating: 3/5

http://www.teluguodu.com

ప్రతి ఒక్కరూ చూసి గర్వించదగిన చిత్రం !

Rating: 3.5/5

www.123telugu.com

ఇది భారత దేశానికి ఇచ్చే గౌరవం.

Rating: 4/5

www.telugumirchi.com

Release Date : 02/17/2017

నటులు : రానా , తాప్సి , కేకే మీనన్ , అతుల్ కులకర్ణి
డైరెక్టర్ : సంకల్ప్ రెడ్డి
మ్యూజిక్ : కృష్ణ కుమార్
నిర్మాత : పివిపి సినిమా మరియు మాటినీ ఎంటర్టైన్మెంట్

కథ :
1970 వ సంవత్సరములో బాంగ్లాదేశ్ తో జరిగే యుద్ధంలో ఆర్మీ కు సపోర్ట్ గా ఘాజీ అనే జలాంతర్గామి ని పంపడం జరుగుతుంది. అయితే బాంగ్లాదేశ్ కు వెళ్ళడానికి భారత సముద్ర జలాలను దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ సముద్ర తీరా ప్రాంతాన్ని భారత దేశానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ధ వాహక నౌక పహారా కాస్తూ ఉంటుంది. ఈ యుద్ధ వాహక నౌకను ఏసుకొని దాటి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇది ముందే పసిగట్టిన భారత దేశం ఘాజి ని నిలువరించడానికి ఎస్ 21 జలాంతర్గామిని పంపడం జరుగుతుంది. ఈ నౌక ఘాజి ని విశాఖపట్నం సముద్ర తీరా జలాలలో ఎదుర్కొనడం జరుగుతుంది. ఈ రెండు జలాంతర్గాముల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా … !

సమీక్ష :
ఘాజి కు మరియు ఎస్ 21 కు మధ్య జరిగిన యుద్ధం గురించి ఇరు దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ యధార్థ గాధను కథగా తీసుకొని ఒక మంచి తెలుగు సినిమాగా తెరకెక్కించడం అనేది ప్రశాంచనీయం. భారత దేశములోనే మొదటిసారిగా ఒక జలాంతర్గామి యుద్దానికి సంబందించన సినిమా తీయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ముఖ్యానంగా ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుల వెంట్రుకను నిక్కబొడుచుకొనేలా ఉండడం మరియు రానా , కేకే మీనన్ మరియు అతుల్ కులకర్ణి వంటి వారి నటనతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. సినిమా మొదటి భాగం మొత్తం వీరి నటనతో అందరిని మెప్పించగలిగారు.
యుద్ధం అంటే ఇప్పటి వరకూ మనము చూసిన వాటికీ ఈ జలాంతర్గాముల యాక్షన్ సన్నివేశాలకు చాల వ్యత్యాసం యుండడం తో కాస్త డ్రామా ఫీల్ కలగడం జరుగుతుంది.

నటుల నటన మరియు సినిమా లోని మంచి డైలాగులు మాత్రమే ఈ సినిమా విజయానికి దోహదం చేస్తాయి అని చెప్పవచ్చు. పాతకాలం నాటి జలాంతర్గాములు సెట్ వేయడం మరియు వాటికి సంబందించిన సెట్ లు నిర్మించిన ఆర్ట్ డిపార్ట్మెంట్ ను మాత్రం మనం తప్పక అభినందించవలసిన అవసరం ఉంటుంది. వీరికి తోడుగా ఈ సన్నివేశాలను తమ సాంకేతిక పరిజ్ఞానంతో అచ్చం కళ్ళముందు నిజంగా జరుగుతున్నట్టు చూపిన వి ఎఫ్ ఎక్స్ టీం ను తప్పక అభినందించాలి. మీనన్ మరియు కులకర్ణి లాంటి సీనియర్ నటులు తో పాటుగా తన పాత్రను తాను అద్భుతంగా పోషించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు మన భల్లాల దేవుడు. ఇక తాపీసీ కాస్త గ్లామర్ అద్దడం కోసమని ఉన్న పాత్రలో తన వంతు న్యాయం తానూ కూడా చేసింది అని చెప్పాలి.

బాగున్నవి :
నటన
కథ
గ్రాఫిక్స్
దర్శకత్వం
డయలాగులు

బాగాలేనివి :
కాస్త నెమ్మదిగా సన్నివేశాలు నడవడం

మొత్తం మీద : మరుగుపడిన చరిత్రను కళ్ళకు కట్టే ప్రయత్నం