గుండెలు జారిపోతున్నాయి కంగ‌నా..!

ఈ ఫోటో చూస్తుంటే మ‌న‌కు క‌లిగించే ఫీలింగ్ అదే. ఆమె అందాల‌తో మ‌న గుండెలు జారిపోతున్నాయి ఇక్క‌డ‌. ఈ మ‌ధ్యే మిస్ట‌ర్ ఇండియా  2017 ఫినాలేకు వ‌చ్చిన కంగ‌న రనౌత్ ఇలాంటి వింత డ్ర‌స్ లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రికీ షాకిచ్చింది. ఆ డ్ర‌స్ లో మోస్ట్ అన్ కఫ‌ర్ట‌బుల్ గా క‌నిపించింది ఈ భామ‌. క్యాస్ట్యూమ్ జారిపోతుంటే అందాల‌ను క‌వ‌ర్ చేసుకోలేక చ‌చ్చిపోయింది కంగ‌న‌. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాష‌న్ ఫాలో అయినా అప్పుడ‌ప్పుడూ ఇలాంటి చిన్న‌చిన్న ఇన్సిడెంట్లు జ‌రుగుతుంటాయి. ఈ విష‌యం కంగ‌న‌కు కూడా తెలుసు. ఈ భామ‌కు ఇప్పుడు బాలీవుడ్ లో సూప‌ర్ ఇమేజ్ ఉంది. హీరోలు కూడా ఈమె క్రేజ్ ముందు దిగ‌దుడుపే.
హీరోల‌తో ప‌నిలేకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తుంది కంగ‌న. ఈ మ‌ధ్యే సిమ్రాన్ సినిమాతో చాలా కాలం త‌ర్వాత ఓ డిజాస్ట‌ర్ మూట గ‌ట్టుకుంది. ఈ చిత్రం వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక సినిమాతో బిజీగా ఉంది కంగ‌న‌. క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించ‌డం విశేషం. ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ పోటోషూట్లు.. ఇలా ఈవెంట్ల‌కు రావ‌డాలు చేస్తుంది కంగ‌న ర‌నౌత్. తాజాగా మిస్ట‌ర్ ఇండియా  ఈవెంట్ లోనే అమ్మాయిగారు ఏ మాత్రం అందాలు దాచుకోకుండా రెచ్చిపోయారు. కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే.. ఎక్క‌డెక్క‌డ అందాలు చూపించాలో అక్క‌డ‌క్క‌డ చూపించారు. కంగ‌న అందాల‌కు స్క్రీన్ పై వేడి రాజుకుంది. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్లు.. మ‌రోవైపు వివాదాలు… ఎటు చూసినా ఇప్పుడు బాలీవుడ్ లో కంగ‌న హ‌వానే క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here