గాయ‌త్రి.. బాబోయ్ చంపేస్తున్నాడుగా..!

Gayatri trailer
90ల్లో మోహ‌న్ బాబు సినిమా వ‌స్తుందంటే చాలా అంచ‌నాలుండేవి. కానీ కాలం మారిపోవ‌డంతో ఆయ‌న కూడా సినిమాలు త‌గ్గిస్తూ వ‌చ్చారు. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. అప్పుడెప్పుడో అల్ల‌రి న‌రేష్ తో ఓ సినిమా చేసిన మోహ‌న్ బాబు.. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ గాయ‌త్రి అంటూ వ‌స్తున్నారు. ముందు ఈ చిత్రంపై కూడా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. కానీ ఇప్పుడు సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం న‌ష్టం దారుణంగా ఉంటుంది. ఎందుకంటే క‌లెక్ష‌న్ కింగ్ ఈ సారి ఏదో చేస్తున్నాడు. చాలా సీరియ‌స్ గా కుమ్మేయ‌డానికి వ‌స్తున్నాడు. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కానీ.. పాట‌లు కానీ గాయ‌త్రిపై అంచ‌నాలు భారీగా పెంచేసాయి. పురాణాల‌పై మంచి ప‌ట్టున్న డైలాగులు చెప్పి అల‌రించాడు మోహ‌న్ బాబు. ముఖ్యంగా ఇటు భార‌తం.. అటు రామాయ‌ణంను స్పృషించాడు మోహ‌న్ బాబు. అప్పుడు రాముడు చేసింది త‌ప్పైతే.. ఇప్పుడు నేను చేసింది కూడా త‌ప్పే అంటూ త‌న బేస్ వాయిస్ తో బెద‌ర‌గొట్టాడు మోహ‌న్ బాబు. ఇక ట్రైల‌ర్ లో అయితే మోహ‌న్ బాబు ర‌చ్చ మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంద‌ని.. మ‌రీ ముఖ్యంగా ఇది అసెంబ్లీ రౌడీ రేంజ్ స్క్రిప్ట్ అంటున్నాడు మోహ‌న్ బాబు. మ‌ద‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఆ రోజు మ‌రో మూడు నాలుగు సినిమాలు వ‌స్తున్నా కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు మోహ‌న్ బాబు. క‌ణం.. కిరాక్ పార్టీ.. తొలిప్రేమ ఇంటిలిజెంట్ లాంటి సినిమాల‌తో పోటీ ప‌డుతూ క‌లెక్ష‌న్ కింగ్ బ‌రిలోకి దిగుతున్నాడు. మ‌రి చూడాలిక‌.. క‌లెక్ష‌న్ కింగ్ ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here