ఖైధీ నెంబర్ 150 రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 6

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మెగా అభిమానులకు సంక్రాంతిని ముందుగానే పరిచయం చేసిన మెగా స్టార్

Rating: 3/5

http://www.teluguodu.com/

ఖైదీ నంబ‌ర్ 150 – అభిమానులకు చిరంజీవి ఇచ్చిన కానుక !

Rating: 3.25/5

http://www.123telugu.com/

మెగాస్టార్ ఖైది నంబర్ 150 మెగా ఫ్యాన్స్ కు పసందైన విందు..!

Rating: 3/5

http://www.apherald.com

ఖైదీ నంబ‌ర్ 150… హృద‌యాల‌ను కొల్ల‌గొడ‌తాడు… ముఖ్యంగా అభిమానుల‌కు పండుగే… 

Rating: 3/5

http://www.indiaglitz.com/

ఖైదీ నెంబర్ 150.. మెగాస్టార్ మేనియా

Rating: 3/5

http://www.tupaki.com/

రైతులు..రత్తాలు… రక్త సింధూరం (చిరు ‘ఖైదీ నంబర్‌ 150’ రివ్యూ)

Rating: 3/5

telugu.filmibeat.com

Release Date : 01/11/2017

నటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్, అలీ, బ్రహ్మానందం, తరుణ్ అరోరా
డైరెక్టర్ : వి వి వినాయక్
కథ మరియు స్క్రీన్ ప్లే : ఏ ఆర్ మురుగదాస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : రత్న వేలు
నిర్మాత : సురేఖ కొణిదెల, రామ్ చరణ్ తేజ్

కథ :

చిన్నపాటి నేరాలకు గాను కత్తి శ్రీను జైలులో ఉంటాడు. అయితే మనోడు జైలు నుండి బయటపడి దేశం వదిలి వెళ్లిపోవాలని అనుకుంటాడు. అయితే తానొకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది. ఇదే పరిస్థితులలో తనలాగా ఉండే మరొకరిని కలుస్తాడు. పోలీస్ లను మాయచేసి తనకు బదులుగా శంకర్ ను జైలుకు పంపుతాడు. శంకర్ లా నటిస్తున్న శ్రీను శంకర్ కు ప్రజలలో ఉన్న పెద్దరికాన్ని మరియు మర్యాదను గురించి తెలుసుకుంటాడు. అయితే శంకర్ కు ఉన్న శత్రువుల ద్వారా శ్రీను కు ప్రమాదం అని తెలుసుకుంటాడు. ఆ గ్రామంలోని ప్రజల కష్టాల కోసం శంకర్ పోరాడుతుంటాడు. పెద్ద పారిశ్రామిక వేత్తలు పేదల భూములను లాక్కొనడంతో వారితో పోరాడుతుంటాడు. ఈ పారిశ్రామిక వేత్తలు శంకర్ ను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య శంకర్ పరిస్థితి ఏమవుతుంది ? శ్రీను పరిస్థితి ఏమవుతుంది ? రైతుల పరిస్థితి ఏమవుతుంది ? భూపోరాటం ఏమవుతుంది ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెర మీద ఖైదీ నెంబర్ 150 సినిమా చూడాల్సిందే …!

సమీక్ష :

మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం మెగా అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదల అవ్వడం జరిగింది. అంతే కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాతో మొదటి సారిగా నిర్మాత అయ్యాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ నటించిన కత్తి సినిమాకు రీమేక్ గా ఖైదీ నెంబర్ 150 తీయడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి తమిళ్ హిట్ సినిమా రీమేక్ చేస్తుండడంతో అందరి చూపు ఈ సినిమా మీదే పడింది. తెరమీద మెగా స్టార్ స్టైల్, డైలాగ్ చెప్పే విధానం, డాన్స్, నటన మరియు మెగా స్టార్ ఎక్సప్రెషన్స్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను కేకలు పెట్టిస్తుంది అని చెప్పవచ్చు. చిరు స్టెప్పులు మరియు స్టంట్ లు తప్పకుండా మెగా అభిమానులకు పండగ లాంటిది. ఎమోషనల్ సన్నివేశాలలోను మరియు క్లైమాక్స్ సన్నివేశంలో చిరంజీవి నటనను తప్పకుండా చూడాల్సిందే .

సినిమా మొదటి భాగం మొత్తం సరదా సన్నివేశాలతోను, కామెడీ తోనూ మరియు రొమాంటిక్ సన్నివేశాలతో అలా అలా సాగిపోతుంది. ఒక రకంగా తరుణ్ అరోరాను మెగా స్టార్ కు విలన్ గా సెలెక్ట్ చేయడం కాస్త ఇంకొకసారి ఆలోచించవలసిన విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెరమీద తరుణ్ మెగాస్టార్ ఎదురుగా అంత పవర్ ఫుల్ గా కనిపించలేదని అభిప్రాయం. కాజల్ అగర్వాల్ తన గ్లామర్ తో ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా అవకాశం లేని పాత్రలో చేసిందని చెప్పాలి. లక్ష్మి రాయ్ మాత్రం ఐటెం సాంగ్ తో మంచి మంచి హాట్ స్టెప్పులతో అదరగొట్టింది అని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు మరియు లారెన్స్ సమకూర్చిన స్టెప్పులు సినిమాకే మంచి హైలెట్ కావడం మరియు తెలుగు ప్రేక్షకులను సినిమా థియేటర్ లలో స్టెప్పులు వేయించేలా అదరగొట్టడం సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి అని చెప్పాలి. రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్ క్వాలిటీ అని చెప్పాలి. మెగా స్టైల్ సినిమాను తెరమీద పరిచయం చేయడంలో డైరెక్టర్ వి వి వినాయక్ మంచి పనితనం చూపినట్టు అర్థం అవుతుంది. విజయ్ సినిమా కత్తిలోలా కాకుండా క్లైమాక్స్ కాస్త మన నేటివిటీకి తగ్గట్టు మార్చడం ఏమో కానీ క్లైమాక్స్ లో కాస్త ఎమోషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. యదార్థ పరిస్థితులతూ కాస్త దూరంగా ఉండడంతో ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంటుంది.

బాగున్నవి :
మెగా స్టార్
సాంగ్స్
కామెడీ
డాన్స్

బాగాలేనివి :
క్లైమాక్స్
కాస్త డైలాగ్స్ ఎక్కువ అయినట్టు అనిపించడం
మెగా స్టార్ కు సరితూగని విలన్

మొత్తం మీద : మెగా అభిమానులకు సంక్రాంతిని ముందుగానే పరిచయం చేసిన మెగా స్టార్