కొర‌టాల వ‌చ్చాడా.. మ‌రి బోయ‌పాటి..?

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి జాతకం ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. అదేదో సినిమాలో ఆహుతి ప్ర‌సాద్ చెప్పిన‌ట్లు నిన్న రైట్ అనుకున్న‌ది.. రేపు రాంగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. నిన్న‌టి వ‌ర‌కు చిరంజీవి త‌ర్వాతి సినిమా ఏంటి అంటే బోయ‌పాటితోనే క‌దా అన్నారు. 3

కానీ సీన్ లోకి ఇప్పుడు స‌డ‌న్ గా కొర‌టాల శివ వ‌చ్చాడు. ఈయ‌న ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌.

ఈ మ‌ధ్యే ఈయ‌న చిరంజీవిని క‌లిసాడు.. ఓ క‌థ కూడా చెప్పాడు. దానికి మెగాస్టార్ కూడా ఓకే అన్నాడు. పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేస్తే చేద్దాం అని మాట కూడా ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. ఎలాగూ వ‌చ్చే ఏడాది వ‌ర‌కు సైరాతోనే బిజీగా ఉంటాడు చిరంజీవి. 2019 మే 9న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లుగా తెలుస్తుంది. ఆ లోపు కొర‌టాల కూడా అఖిల్ తో సినిమా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. డిసెంబ‌ర్ నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే.. కొర‌టాల సీన్ లోకి వ‌స్తే మ‌రి బోయ‌పాటి ఏమైపోయిన‌ట్లు..? ప‌్ర‌స్తుతం ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌య్యాక బాల‌య్య‌తో సినిమా క‌మిట్మెంట్ ఉంది. ఈ రెండూ పూర్త‌య్యేలోపు చిరు త‌న సైరా పూర్తి చేసుకుని రెడీగా ఉంటాడు. కానీ ఇప్పుడు కొర‌టాల వ‌స్తే.. బోయ‌పాటికి హ్యాండ్ త‌ప్ప‌దు. చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు ఈ క‌థ‌లో ఇంకెన్ని ట్విస్టులు ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here