కాబిల్ రివ్యూ

MOVIE METER

Average Rating: 2
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఒకసారి చూడచ్చు మరి

Rating: 2.25/5

http://www.teluguodu.com/

Release Date : 01/25/2017

నటులు : హ్రితిక్ రోషన్ , యామిని గౌతమ్ , రాయ్ , నరేంద్ర ఝా
డైరెక్టర్ : సునాయ్ గుప్తా
నిర్మాత : రాకేష్ రోషన్
కథ :
ఈ కథలో మన హీరో గుడ్డివాడైనప్పటికీ మంచి తెలివి కలిగినవాడు . మనోడు దుబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఒక రోజు మనోడు హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఈ కథ లో మన హీరోయిన్ కూడా అంధురాలు. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తరువాత కొత్త ఇంటికి వెళ్లడం జరుగుతుంది. ఇద్దరు దుర్మార్గులు హీరోయిన్ మీద అత్యాచారం చేయడం జరుగుతుంది. వారిమీద పోలీస్ లకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఉన్న రాజకీయ నాయకుల పలుకుబడితో బయటకు రావడం జరుగుతుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య హీరోయి వీరి మీద ఎలా పగతీర్చుకుంటాడు ? గుడ్డివాడు ఎలా వీరిని ఎదుర్కొంటాడు ? వంటివి తెలుసుకోవాలంటే తెరమీద కాబిల్ సినిమా చూడాల్సిందే !
సమీక్ష :
రొమాంటిక్ డ్రామా గా మోడైన ఈ సినిమా కథ రివెంజ్ స్టోరీ గా మారిపోతుంది. ఇలాంటి కథలు చాల వచ్చినప్పటికీ కథలో ఇద్దరూ గుడ్డివారు కావడం కాస్త కొత్తదనం అవుతుంది. ఈ సినిమా కు అందించిన స్క్రీన్ ప్లే సినిమా ను బాగా రక్తి కట్టేలా చూపించడం జరిగింది. డైరెక్టర్ సునాయ్ తనం పనితనం తో సినిమా ను మంచి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించడం జరిగింది. అంతే కాకుండా హ్రితిక్ రోషన్ ఫాన్స్ కావలసి యాక్షన్ సన్నివేశాలు కూడా పొందుపరచడంతో మంచి స్పందన వచ్చింది అని చెప్పాలి . ఈ సినిమా లో హీరోయిన్ యామిని గౌతమ కూడా తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది.
అయితే సినిమా కథకు ఇంకా కొద్దిగా ఆస్కారం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన సహా నటులు అందరూ ఇలా వచ్చి అలా వెళ్లేలా ఉండడం వలన పెద్దగా వారిని వాడుకోలేకపోయారు అని చెప్పవచ్చు. ఈ సినిమా కు పనిచేసిన సినిమాటోగ్రఫీ యూనిట్ తమ చక్కని పనితీరుతో చిత్రించడం సినిమాకు మంచి ఊపును ఇచ్చింది. సినిమా లోని పాటలు పెద్దగా ప్రభావం చూపనప్పటికీ పరవాలేదు అని అనిపించాయి.
బాగున్నవి :
హ్రితిక్ రోషన్
యామిని గౌతమ్
యాక్షన్
బాగాలేనివి :
సెకండ్ హాఫ్
స్టోరీ
మొత్తం మీద : ఒకసారి చూడచ్చు మరి