కనుపాప రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

థ్రిల్లింగ్ తక్కువే

Rating: 2.5/5

http://www.teluguodu.com/

Release Date : 02/03/2017

నటులు : మోహన్లాల్ , విమల రావణ్ , వేణు , బేబీ మీనాక్షి
డైరెక్టర్ : ప్రియదర్శన్
నిర్మాత : మోహన్లాల్
కథ : అంధుడు ఐన జయరాం లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. నిజాయితీ మరియు జాలి దయ్యాలు కలిగిన జయరాం ను ఎందరో గోరవిస్తుంటారు. ఊటీ బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్న నందిని తాతగారు ఒక విశ్రాన్త జడ్జి . కృష్ణ మూర్తి చేత శిక్షవిధించినబడిన ఒక సైకో వీరిని హత్య చేసే ప్రయత్నం చేస్తుంటాడు. పోలీస్ లకు కూడా లంచాలు ఇచ్చి తన వైపుకు తిప్పుకుని వారికి వెతిరేకంగా ఉండేలా చూసుకొంటాడు. నందిని ని కాపాడే భాద్యత జయరాముకు తాతగారు అప్పగీస్తారు. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య జయరాం ఎలా నందినిని కాపాడుతాడు ? సైకో కిల్లర్ ఏమి చేస్తాడు ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెరమీద కనుపాప సినిమా చూడాల్సిందే !

సమీక్ష :
ఒప్పం అనే మలయాళం సినిమా ను తెలుగు లో కనుపాప అని దుబ్ చేయడం జరిగింది. మోహన్ లాల్ ఏ సినిమా మొత్తాన్ని తన భుజాల మేడే మోశాడు అని చెప్పాలి. అంధుడు అయినా లైఫ్ ఆపరేటర్ గా పని చేసే పాత్రలో తెలుగు ప్రేక్షకులను మాయమరిపింప చేసాడు అని చెప్పాలి. అంధుడు గాను , తెలివైన వాడిగాను మరియు సినిమా హీరోగానూ అందరి మన్ననలు పొందాడు. ఎమోషనల్ డ్రామా త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా కు అందించిన స్క్రీన్ ప్లే ఎమోషనల్ డ్రామా మరియు త్రిల్లర్ కు మధ్య ఊగిసలాడేలా చక్కగా అమర్చారు. సినిమా మొదటి భాగం మొత్తం సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం మరియు సదా సీదాగా నడపడం జరిగుతుంది. సెంటిమెంట్ లను పరిచయం చేయడం కోసం అని సైకో కిల్లర్ ను వాడుకోవడం జరిగింది. దీని వలన సినిమా థ్రిల్లర్ అనే విషంయం డైరెక్టర్ మరచిపోయినట్టు అనిపిస్తుంది.
సినిమా త్రిల్లర్ అనిపించడానికి ఇంకాస్త సన్నివేశాలు అద్దినట్టయ్యి ఉంటె సినిమా మరొకలా ఉండేది అని అభిప్రాయం. సినిమా రెండవ భాగం కాస్త నెమ్మదిగా నడవడం వాలా కాస్త స్పీడ్ తగ్గినట్టు అనిపిస్తుంది. బేబీ మీనాక్షిని తన వయసుకు మించిన నటనను ప్రదర్శించడం హర్షించ దగ్గ విషయం. ఈ సినిమా లో సైకో కిల్లర్ గా చేసిన సమూత్రికాని ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు అని చెప్పాలి. లేడీ కాప్ గా చేసిన అనుశ్రీ పెద్దగా మెప్పించలేకపోయింది అని చెప్పాలి. మొత్తం మీద ఇది మోహన్ లాల్ ఒక్కడి సినిమా అని చెప్పవచ్చు.

బాగున్నవి :
మోహన్ లాల్
సాంకేతిక విలువలు

బాగాలేనివి :
ఓవర్ సెంటిమెంట్
సెకండ్ హాఫ్

మొత్తం మీద : థ్రిల్లింగ్ తక్కువే