తాజా వార్తలు ఫీచర్ న్యూస్

ఒక్కడు మిగిలాడు మూవీ విడుదల తేదీ వాయిదా!

Date: September 4, 2017 03:29 pm | Posted By:
మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా...

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు. చిత్రం విడుదల తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. మనోజ్ నటన ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా చాలా అద్భుతంగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం లో మనోజ్ సరసన అనీషా అంబ్రోస్ నటించగా అజయ్, జెన్నిఫర్, మురళీమోహన్, సుహాసిని, బెనర్జీ, మిలింద్ గునాజి ఇతర నటీనటులు. ఈ చిత్రానికి శివ నందిగాం సంగీతం అందించగా వి కే రామరాజు సినిమాటోగ్రఫీ, పి ఎస్ వర్మ ఆర్ట్.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • Okkadu Migiladu Proves It Again!

  Tollywood continues to change gears from regular commercial movies to serious subjects. Not only Tollywood but also Bollywood is also concentrating on epic dramas and periodic dramas. If we...
 • Manoj Surprised By His Fans Love!

  Okkadu Migiladu Movie Review

  Cast: Manchu Manoj Kumar, Anisha Ambrose Director : Ajay Andrews Nuthakki Music: Siva R Nandigam Producer : Laxmikanth Banner: Padmaja Films Okkadu Migiladu Story: Surya(Manoj) leads student agitation as...
 • ఒక్కడు మిగిలాడు రివ్యూ

  తారాగణం: మంచు మనోజ్, అనిషా అంబ్రోస్ దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి సంగీతం: శివ ఆర్ నందిగం నిర్మాత : లక్ష్మి కాంత్ బ్యానర్: పద్మజ ఫిలిమ్స్ కథ: ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు అత్యాచారానికి గురవ్వడంతో సూర్య(మనోజ్) తోటి...
 • I was protecting my family in dreams, says hero

  కలలో కూడా అవే వస్తున్నాయి: మంచు మనోజ్

    మరో రెండు రోజుల్లో ఒక్కడు మిగిలాడు గా మనముందుకు రాబోతున్న మంచు మ‌నోజ్ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. ఇటీవలే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తన ఎమోషనల్ స్పీచ్ లో సంచలనాత్మక కామెంట్ లు చర్చనీయాంశమయ్యాయి....