తాజా వార్తలు ఫీచర్ న్యూస్

“ఒక్కడు మిగిలాడు” చిత్రంలోని మంచు మనోజ్ సెకండ్ లుక్ విడుదల!!

Date: May 19, 2017 05:51 pm | Posted By:
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “ఒక్కడు మిగిలాడు”. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై...
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “ఒక్కడు మిగిలాడు”. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదివరకు విడుదలైన ప్రభాకరన్ గా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన రాగా.. రేపు (మే 20) మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో మంచు మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్ ను విడుదల చేశారు. మిలిటెంట్ లీడర్ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మంచు మనోజ్ స్టూడెంట్ లుక్ కోసం దాదాపు 15 కేజీలు తగ్గడం విశేషం.
సెకండ్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. “ఎల్.టి.టి.ఐ కమాండర్ గా మంచు మనోజ్ లుక్ కు ఇప్పటికీ విశేషమైన రీతిలో ఆదరణ లభిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రంలో మనోజ్ సెకండ్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశాం. పాత్ర కోసం ఆయన పడిన శ్రమ స్క్రీన్ పై కనిపిస్తుంది. కేవలం నెలల వ్యవధిలో 15 కేజీల బరువు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. పాత్ర పండించడానికి మనోజ్ పడే ప్రయాస ఏంటో అదే చెబుతుంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకొన్నాయి. జూన్ మొదటివారంలో ఆడియోను విడుదల చేసి.. నెలాఖరుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అన్నారు.
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి!
Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • ఒక్కడు మిగిలాడు టీజర్ రివ్యూ

  మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ఒక్కడు మిగిలాడు టీజర్ నిన్న విడుదల అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకొంది. డైలాగ్ కింగ్ కడుపున పుట్టిన మంచు మనోజ్ ఈ సినిమాలో తన ఒరిజినల్ ఫ్లేవర్ డైలాగ్...
 • Okkadu Migiladu Teaser Is Terrific

    Teaser of Manchu Manoj’s upcoming movie ‘Okkadu Migiladu’ is out. The teaser is raised expectations over the movie. It is emotionally power-packed and has got some goose-bump moments....
 • Manchu Manoj’s Shocking Decision

  Teaser of Manchu Manoj’s upcoming film ‘Okkadu Migiladu’ will be unveiled today at 4.30 PM. Meanwhile, the Rocking Star has made shocking announcement on his social networking page. Manoj...
 • Manchu Manoj Donates To Farmers

  Manchu Manoj has always been active in contributing his bit for social cause. During Hudhud Cyclone in Visakhapatnam, the ‘Current Teega’ star had not just donated food supplies and...