ఏ రోజైతే చూశానో రివ్యూ

MOVIE METER

Average Rating: 1
Total Critics: 2

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మెప్పించలేని ఏ రోజైతే చూశానో

Rating: 1.25/5

www.teluguodu.com

చూడకపోవడమే మంచిది

Rating: 1.5/5

www.123telugu.com

Release Date : 01/07/2017

నటులు: మనోజ్ నందన్, స్మితిక ఆచార్య

డైరెక్టర్ : బాల జి

ప్రొడ్యూసర్స్ : సిండిరి గిరి, తన్నీరు సింహాద్రి

మ్యూజిక్ : శశి కిరణ్

కథ:

బాలు (మనోజ్ నందన్) అనే ఉత్సాహభరితంగా ఉండే కాలేజీ స్టూడెంట్ అదితి (స్మితిక) తో ప్రేమలో పడతాడు. గతంలో తనకున్న చేదు అనుభవాల వల్ల బాలు లవ్ ప్రపోజల్ అదితి తిరస్కరిస్తుంది. బాలు అన్ని రకాల చేష్టలతో తనపై ఉన్నది ఆకర్షణ కాదని తాను నిజాయతి పరుడినని నిరూపించే ప్రయత్నాలన్నీ చేస్తాడు. అదితి వ్యతిరేకిస్తు ఉంటుంది. బాలు ప్రేమకు న్యాయం చేయగలిగాడా? తన ప్రేమ నిజమని అదితి ఒప్పుకుందా ? వీటికి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

ఇదో ఉత్తేజకరంగా లేని మాములు ప్రేమ కథ. స్క్రీన్ప్లే కూడా మాములుగా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటే కొంచం కొత్తగా ఉంది కానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది. అస్థిరమైన మరియు బలవంతమైన దృశ్యాలు చూడ్డానికి భారంగా అనిపిస్తాయి. పేలవంగా ఉన్న స్క్రిప్ట్ తీసుకుని సిల్లి మూవీగా తెరకెక్కించారు.

ఈ సినిమా ఈ రోజుల్లో కొన్ని బాగా తీసిన షార్ట్ ఫిలిమ్స్ కి మ్యాచ్ అవలేదు. హీరో మరియు తన ఫ్రెండ్స్ సిల్లీ కామెడీ ట్రై చేసారు. లీడ్ పెయిర్ మధ్య కుదరని రొమాన్స్ చిరాకు తెప్పిస్తాయి. రామ్ గోపాల్ వర్మ సావిత్రి కోసం చేసినట్లుగా శృంగార పోస్టర్లు మరియు ట్రైలర్స్ తో మేకర్స్ యూత్ ని టెంప్ట్ చేయడానికి ట్రై చేసారు.

ఈ సినిమా ఏ రకంగాను ప్రేక్షకుణ్ణి ఎంటర్టైన్ చేయలేదు. అతడు మరియు ఛత్రపతి చిత్రాల్లో యువ మహేష్ మరియు ప్రభాస్ లా నటించిన మనోజ్ నందన్ సరైన అవకాశాలు లేక ఇందులో చేయడం దురదృష్టకర విషయం. తాను ఇలాంటి చెత్త సినిమాల్లో నటించే బదులు మంచి సైడ్ క్యారెక్టర్ రోల్స్ ఎంచుకోవడం మంచిది. స్మితిక అందాల ప్రదర్శన వృధా అయింది. సినిమాటోగ్రఫీ భయంకరంగా ఉంది. మ్యూజిక్ యావరేజ్.

ప్లస్ పాయింట్స్:

ట్రైలర్స్ లో చూపించిన రొమాంటిక్ సీన్స్

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ అండ్ బోర్ కొట్టే స్క్రీన్ప్లే

తీర్పు: మెప్పించలేని ఏ రోజైతే చూశానో…