ఎన్టీఆర్ కు సాయం చేస్తున్న త్రివిక్ర‌మ్..

ద‌ర్శ‌కుడు హీరో అనేది భార్యాభ‌ర్త‌ల బంధంలా ఉండాలి. అక్క‌డ ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకుంటే కాపురం సాఫీగా సాగిపోతుంది.. ఇక్క‌డ వీళ్లు అర్థం చేసుకుంటే సినిమా అందంగా వ‌స్తుంది. త్రివిక్ర‌మ్ కూడా ఇప్పుడు చేస్తుందిదే. ఈయ‌న ఎన్టీఆర్ ను బాగా అర్థం చేసుకున్నాడు. ఒక్క మాట కూడా తేడా రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు.

ARAVINDA SAMETHA

అర‌వింద స‌మేత మొద‌లైన కొత్త‌లో కొన్ని విభేధాలు వ‌చ్చాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై ఎన్టీఆర్ ఆస‌క్తిగా లేడ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే త‌ర్వాత త‌ర్వాత త్రివిక్ర‌మ్ దాన్ని క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చాడు. ఇక ఇప్పుడు పూర్తిగా అర‌వింద స‌మేత‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నాడు యంగ్ టైగ‌ర్. ఇలాంటి టైమ్ లో ఆయ‌న తండ్రి చ‌నిపోవ‌డం అనూహ్యం. దాంతో మ‌ళ్లీ ఒక్క‌సారిగా ఎన్టీఆర్ షాక్ లోకి వెళ్లిపోయాడు.

అందుకే ఈ క‌ష్ట స‌మ‌యంలో అర‌వింద స‌మేత టీం అంతా ఎన్టీఆర్ స‌మేతంగా మారిపోయారు. ఆయ‌న ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ కు వ‌చ్చేలా ఆయ‌న ఇంటికి ద‌గ్గ‌ర్లోనే షూటింగ్ పెట్టాడు త్రివిక్ర‌మ్. చేసే మూడ్ ఉంటే చేస్తున్నాడు లేదంటే వెళ్లిపోతున్నాడు ఎన్టీఆర్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మాత గురించి ఆలోచించి ఒక్క రోజు కూడా షూటింగ్ కు ప్యాక‌ప్ ముందుగా చెప్ప‌లేదు జూనియ‌ర్. త్రివిక్ర‌మ్ కూడా అన్నీ అనుకున్న‌ట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న ఎమోష‌న‌ల్ స్టేట‌స్ కు క‌చ్చితంగా ఇంటి వాళ్లతో కూడా క‌లిసుండాలి. అందుకే షూటింగ్ కూడా త్వ‌ర‌గా పూర్తి చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఒక్క‌సారి ప్యాక‌ప్ చెప్పిన త‌ర్వాత ఎన్టీఆర్ ను పూర్తిగా వ‌దిలేస్తున్నాడు. ఇలా ఇద్ద‌రూ ఇప్పుడు ఓ అండ‌ర్ స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారు. అక్టోబ‌ర్ లో ద‌స‌రా కానుక‌గా అర‌వింద స‌మేత విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here